కోలీవుడ్ ప్రముఖ నటుడు కమల్ హాసన్ కథానాయకుడిగా సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘ఇండియన్2’.. ఆ మధ్య ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో.. సెట్లో జరిగిన క్రేన్ ప్రమాదం కారణంగా ఇండియన్-2 సినిమా మధ్యలో ఆగిపోవడం.. ఆ తర్వాత ఎంతకీ అది పున:ప్రారంభం కాకపోవడం.. ఈ విషయమై దర్శకుడు శంకర్, నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ అధినేతల మధ్య తీవ్ర విభేదాలు నెలకొనడం తెలిసిన సంగతే.
త్వరగా ఈ సినిమాను పున:ప్రారంభించే విషయం తేల్చాలని కొన్ని నెలల ముందు నిర్మాతలను నిలదీస్తే వాళ్లు స్పందించలేదు. తర్వాత శంకరేమో రామ్ చరణ్‌తో వేరే సినిమా మొదలుపెట్టడానికి సన్నాహాలు చేసుకుంటుంటే నిర్మాతలు అడ్డం పడ్డారు.వీళ్లిలా గొడవ పడుతుంటే హీరో కమల్ హాసన్ మాత్రం చోద్యం చూస్తూ కూర్చున్నాడు. నిజానికి ‘ఇండియన్-2’ పున:ప్రారంభం కాకపోవడానికి అసలు కారణం కమలే అన్నది కోలీవుడ్ వర్గాల మాట.
క్రేన్ ప్రమాదం తర్వాత నిర్మాతలతో ఆయనకు పెద్ద గొడవే జరిగింది. ఆయన పొలిటికల్ కమిట్మెంట్లు కూడా సినిమా మళ్లీ మొదలు కాకపోవడానికి కారణం. ఇండియన్-2 సంగతి తేల్చకుండా ‘బిగ్ బాస్’ షో చేయడం, అలాగే ‘విక్రమ్’ అనే మరో సినిమాను ఆయన మొదలుపెట్టడం తెలిసిందే.ఐతే ఇటీవల వెల్లడైన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కమల్ హాసన్ పార్టీకి ఒక్కటంటే ఒక్క సీటు రాలేదు. స్వయంగా కమలే ఓడిపోయాడు.
ఇప్పుడు తన రాజకీయ గమ్యం ఏంటో తెలియని అయోమయంలో ఉన్నారు కమల్. ప్రస్తుతానికి రాజకీయాల్లో ఆయన చేయడానికి ఏమీ లేదు. దీంతో మళ్లీ అభిమానుల కోరిక మేరకు సినిమాల్లో బిజీ అవ్వాలని కమల్ చూస్తున్నట్లు చెబుతున్నారు.ఈ క్రమంలోనే ‘ఇండియన్-2’ వివాదాన్ని పరిష్కరించి ఈ సినిమాను పున:ప్రారంభించడానికి కమలే చొరవ తీసుకోనున్నాడట. ఏకంగా రూ.180 కోట్లు ఖర్చు పెట్టిన సినిమాను ఆపేయడం సరి కాదని భావించి.. లైకా అధినేతలు, శంకర్‌తో మాట్లాడి సాధ్యమైనంత త్వరగా ‘ఇండియన్-2’ను పున:ప్రారంభించి పూర్తి చేయాలని కమల్ భావిస్తున్నట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి..!!
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…