Movie News

‘పుష్ప’ విషయంలో సుకుమార్ స్ట్రాటజీ మాములుగా లేదుగా.. మన రాజమౌళినే మించిపోయాడు..!!

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప’..ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకి సంబంధించి గత రెండు రోజులుగా ఓ వార్త తెగ చక్కర్లు కొడుతోంది..అదే పుష్ప రెండు భాగాలుగా తెరకెక్కుతుండడం.. ప్రింట్, ఎలక్ట్రానిక్, వెబ్ అని తేడా లేకుండా అన్ని మీడియాల్లోనూ ఈ వార్త హల్‌చల్ చేసింది. సోషల్ మీడియాలోనూ దీని గురించి పెద్ద చర్చ జరిగింది.

ఇది జస్ట్ రూమరా.. నిజమైనా వార్తేనా అన్న విషయంలో సందిగ్ధత కొనసాగుతోంది. నిజమే అయితే.. అధికారికంగా ప్రకటన ఏమీ లేదే అన్న డౌట్ కొడుతోంది.కానీ వాస్తవం ఏంటంటే.. ఈ విషయంలో సుకుమార్ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదట. ముందు ఆయన టీం నుంచే ఈ మేరకు మీడియాకు లీక్ ఇచ్చినట్లు సమాచారం. మీడియా ఎలా స్పందిస్తుంది.. ప్రేక్షకులు ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తారు.. సోషల్ మీడియాలో ఎలాంటి ఫీడ్ బ్యాక్ వస్తుంది అని చూడటానికే ఈ లీక్ ఇచ్చాడట సుక్కు.

జనాల స్పందనను బట్టి సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేసే విషయంలో నిర్ణయం తీసుకుంటారట.ఈ నెలాఖరుకు సుక్కు ‘పుష్ప’ను రెండు భాగాలుగా రిలీజ్ చేసే విషయమై నిర్ణయం తీసుకుంటారన్నది తాజా సమాచారం. ఇంతకుముందు ‘బాహుబలి’ని ఒక సినిమాగా తీయాలని మొదలుపెట్టి.. మధ్యలో నిడివి ఎక్కువవుతోందని భావించి, ఆర్థిక ప్రయోజనాలు కూడా చూసుకుని రెండు భాగాలుగా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ముందు కొంత వ్యతిరేకత వచ్చినా.. చివరికి ఆ ప్రయోగం అద్భుత ఫలితాలను ఇచ్చింది.

ఇప్పుడు సుక్కు ఆలోచన కూడా ఇలాగే ఉంది. ఆయన ‘పుష్ప’ కోసమని ఎంతో పరిశోధన చేశారు. బోలెడంత కంటెంట్ రెడీ చేశాడు. ఒక దశలో ‘పుష్ప’ సినిమా తీయగా మిగిలిన కంటెంట్‌తో ఓ వెబ్ సిరీస్ తీయాలని ఆయన అనుకున్నారు. కానీ తర్వాత ఆ ఆలోచన విరమించుకున్నారు.ఐతే ఇప్పుడు ఆయనకు రెండు భాగాలుగా సినిమా తీసే ఆలోచన వచ్చింది. ఐతే ‘బాహుబలి’ సంగతి వేరు. ‘పుష్ప’ లాంటి సోషల్ సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేస్తే వర్కవుట్ అవుతుందా అన్న సందిగ్ధత కూడా లేకపోలేదు. అందుకే తన టీంతో మరింతగా చర్చించి.. జనాల ఫీడ్ బ్యాక్ చూసుకుని.. అలాగే స్క్రిప్టు ఏమేర సపోర్ట్ చేస్తుందో చూసుకుని సుకుమార్ ఈ విషయం పై ఓ డెసిషన్ తీసుకోనున్నాడట…!!

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

‘ఆపరేషన్ సింధూర్’ అమరవీరులు వీరే.. తొలిసారి పేర్లు వెల్లడించిన భారత ఆర్మీ..!

దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో ప్రాణాలను పణంగా పెట్టి పోరాడే సైనికులు ప్రతి భారతీయుడికి స్ఫూర్తి. దేశం కోసం తమ…

10 hours ago

బిగ్‌బాస్-10లో పోలీస్ ఎంట్రీ..? ఎస్‌ఐ వీడియోపై నెటిజన్లలో హాట్ డిబేట్..!

తెలుగు బుల్లితెరపై అత్యధిక ఆదరణ పొందిన రియాలిటీ షోల్లో బిగ్‌బాస్ తెలుగు ఒకటి. ఇప్పటికే విజయవంతంగా తొమ్మిది సీజన్లు పూర్తి…

10 hours ago

ఖాళీ కడుపుతో వర్కవుట్ చేస్తున్నారా..? ఈ తప్పు చేస్తే ఆరోగ్యానికే ముప్పు..!

ప్రస్తుతం ఆరోగ్యంపై అవగాహన గతంతో పోలిస్తే ఎంతో పెరిగింది. ముఖ్యంగా కరోనా తర్వాత చాలా మంది ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు.…

11 hours ago

ప్రభాస్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ‘బాహుబలి 3’ రానుందంటూ ప్రకటన..!

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిన చిత్రాల్లో 'బాహుబలి'కి ప్రత్యేక స్థానం ఉంది. దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ఈ…

16 hours ago

‘పెద్ది’ ప్రభావమా..? చరణ్-సుకుమార్ సినిమాకు బడ్జెట్ కత్తెర..?

టాలీవుడ్‌లో ప్రస్తుతం ఎక్కువగా చర్చకు వస్తున్న అంశాల్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తదుపరి సినిమా ఒకటి. దర్శకుడు…

16 hours ago

తిరుమలకు వెళ్లేవారికి గుడ్‌న్యూస్.. ప్రతిరోజూ వెయ్యి మందికి ఉచిత దర్శనం..!

తిరుమల శ్రీవారి దర్శనం కోసం ప్రతి రోజు లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. వృద్ధులు, దివ్యాంగులు, చిన్నారులతో వచ్చే కుటుంబాలకు…

18 hours ago