Kangana Ranaut: బాలీవుడ్ కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.నిత్యం ఏదో ఒక వివాదంతో ద్వారా వార్తల్లో నిలిచే ఈ వివాదాస్పద బ్యూటీ తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు. నిత్యం బాలీవుడ్ ఇండస్ట్రీని విమర్శించే ఈ ముద్దుగుమ్మ ఈ సారి సౌత్ స్టార్స్ పై ప్రశంసలు కురిపిస్తూ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.
ఈ సందర్భంగా కంగనారనౌత్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కన్నడ స్టార్ హీరో యశ్ ఫోటోలను షేర్ చేస్తూ వారి పై ప్రశంసల వర్షం కురిపించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వీరిగురించి చేస్తున్న పోస్ట్ వైరల్ గా మారింది.
ఈ క్రమంలోనే ఈ హీరోలిద్దరూ ఫోటోలను షేర్ చేస్తూ దక్షిణాది రాష్ట్ర హీరోలకు ఎందుకు అంత ఆదరణ లభించింది అంటూ ప్రస్తావించారు. దక్షిణాది సినిమా సెలబ్రిటీలు మనదేశ సంస్కృతి మూలాలకు కట్టుబడి ఉన్నారు. వీరు సినిమా పై ఉన్న మక్కువతో సినిమాలలో నటిస్తూనే కుటుంబానికి ఎంతో ప్రాధాన్యతనిస్తారు అంటూ ఈ హీరోలపై పొగడ్తల వర్షం కురిపించింది.
ఈ విధంగా కంగనా రనౌత్ వీరిగురించి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే బాలీవుడ్ మిమ్మల్ని పాడు చేయడానికి ప్రయత్నించవచ్చు వీరి ఉచ్చులో చిక్కకండి అంటూ తెలిపారు. ఇకపోతే అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా ఏ స్థాయిలో ఎలాంటి గుర్తింపు సంపాదించుకుందో మనకు తెలిసిందే. అదేవిధంగా కేజిఎఫ్ సినిమా ద్వారా యశ్ సైతం పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సంపాదించుకోవడంతో వీరి గురించి ఈ విధమైనటువంటి పోస్ట్ చేస్తూ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలోని ఊ అంటావా.. ఊఊ అంటావా అనే సాంగ్‌ను సైతం యాడ్ చేసింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…