కొంతమంది సినీ ప్రముఖులు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తారు. అందులో ముఖ్యంగా కంగనా రనౌత్ ముందుంటారు. బోల్డ్‌గా, ఎవరు ఏమనుకున్నా.. అనిపించింది చెప్పేస్తుంది. సినీ పరిశ్రమలో ఇలాంటి వారు కనిపించడం చాలా అరుదు. ఏ సమస్యపై అయినా తనదైన రీతిలో స్పందిస్తూ కంగనా ఎప్పుడూ వార్తల్లోనే ఉంటుంది.
అంతే కాకుండా తనకు అవసరం లేని విషయాల్లో కూడా స్పందిస్తూ ఏరికోరి సమస్యలను తెచ్చుకుంటుంది. తాజాగా ఆమె సిక్కులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతు చట్టాలను రద్దు చేయాలని దేశవ్యాప్తంగా రైతులు దాదాపు సంవత్సరం నుండి నిరసనలు చేపట్టారు. అయితే ఇన్ని రోజుల తర్వాత ప్రభుత్వం వారి నిరసనలకు తలొంచి సాగు చట్టాలను రద్దు చేస్తూ మోదీ ప్రభుత్వం ప్రకటనను ఇచ్చిన విషయం తెలిసిందే.
తర్వాత రైతులు ఆనందంతో సంబరాలు చేసుకుంటున్న సందర్భంలో తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కంగనా స్పందించారు. ఆమె ఢిల్లీ సరిహద్దులో ఏకధాటిగా నిరసనలు చేస్తున్న ఖలిస్థానీ ఉద్యమంతో రైతులను పోలుస్తూ పోస్ట్ పెట్టింది. దీనిపై సిక్కు మతస్తులు ఆమెపై కేసు నమోదు చేశారు.
సబ్ అర్బన్ ఖార్ పోలీస్ స్టేషన్‌లో కంగనాపై కేసు నమోదయ్యింది. ఆమె ఉద్దేశ్యపూర్వకంగా ఆ పోస్టు చేశారని.. సిక్కులను ఖలిస్తానీ టెర్రరిస్టులంటూ వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో సిక్ గురుద్వారా మేనేజ్‌మెంట్ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. దీనిపై నెటిజన్లు కూడా తీవ్రంగా స్పందిస్తున్నారు. ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…