మరో వివాదంలో కంగనా.. ఆమెపై విరుచుకుపడుతున్న రైతులు..!

0
29

కొంతమంది సినీ ప్రముఖులు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తారు. అందులో ముఖ్యంగా కంగనా రనౌత్ ముందుంటారు. బోల్డ్‌గా, ఎవరు ఏమనుకున్నా.. అనిపించింది చెప్పేస్తుంది. సినీ పరిశ్రమలో ఇలాంటి వారు కనిపించడం చాలా అరుదు. ఏ సమస్యపై అయినా తనదైన రీతిలో స్పందిస్తూ కంగనా ఎప్పుడూ వార్తల్లోనే ఉంటుంది.

అంతే కాకుండా తనకు అవసరం లేని విషయాల్లో కూడా స్పందిస్తూ ఏరికోరి సమస్యలను తెచ్చుకుంటుంది. తాజాగా ఆమె సిక్కులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతు చట్టాలను రద్దు చేయాలని దేశవ్యాప్తంగా రైతులు దాదాపు సంవత్సరం నుండి నిరసనలు చేపట్టారు. అయితే ఇన్ని రోజుల తర్వాత ప్రభుత్వం వారి నిరసనలకు తలొంచి సాగు చట్టాలను రద్దు చేస్తూ మోదీ ప్రభుత్వం ప్రకటనను ఇచ్చిన విషయం తెలిసిందే.

తర్వాత రైతులు ఆనందంతో సంబరాలు చేసుకుంటున్న సందర్భంలో తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కంగనా స్పందించారు. ఆమె ఢిల్లీ సరిహద్దులో ఏకధాటిగా నిరసనలు చేస్తున్న ఖ‌లిస్థానీ ఉద్య‌మంతో రైతులను పోలుస్తూ పోస్ట్ పెట్టింది. దీనిపై సిక్కు మతస్తులు ఆమెపై కేసు నమోదు చేశారు.

సబ్‌ అర్బన్‌ ఖార్‌ పోలీస్ స్టేషన్‌లో కంగనాపై కేసు నమోదయ్యింది. ఆమె ఉద్దేశ్యపూర్వకంగా ఆ పోస్టు చేశారని.. సిక్కులను ఖలిస్తానీ టెర్రరిస్టులంటూ వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో సిక్‌ గురుద్వారా మేనేజ్‌మెంట్‌ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. దీనిపై నెటిజన్లు కూడా తీవ్రంగా స్పందిస్తున్నారు. ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here