Featured

హీరోయిన్ సంజన ఫోన్ లో నీలి ఫోటోలు వీడియోలు.. శాండిల్ వుడ్ డ్రగ్స్ కేసులో మరో ట్విస్ట్ !

కన్నడ చిత్రపరిశ్రమలోనూ డ్రగ్స్‌ వ్యవహారం కుదిపేస్తోంది. ఒకప్పుడు బాలీవుడ్ మరియు టాలీవుడ్ తారలను షేక్ చేసిన డ్రగ్స్ వ్యవహారం తాజాగా శాండిల్ వుడ్ లోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న కేంద్ర నేర నియంత్రణ విభాగం ఇప్పటికే సినీ నటి రాగిణి ద్వివేదితో పాటు నటి సంజనా గల్రానీని కూడా అరెస్టు చేసి సంజన ఇంట్లో ల్యాప్ టాప్‌, హర్డ్‌ డిస్క్‌, 3 మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. వీరిద్దరూ అరెస్ట్ అయినా తర్వాత జరిపిన విచారణలో భాగంగా వీళ్లిద్దరి మొబైల్ ఫోన్లను పరిశీలించగా, వాటిల్లో నీలి చిత్రాల వీడియోలు ఉన్నట్టు, దాంతో ఈ హీరోయిన్లకు సెక్స్ రాకెట్ కూడా సంబంధాలున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

తాజాగా ఈ హీరోయిన్లిద్దరూ పెట్టుకున్న బెయిల్ పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. ఈ నేపథ్యంలో జైల్లో ఉన్న హీరోయిన్లు రాగిణి ద్వివేది, సంజనా గల్రానీ స్మార్ట్ ఫోన్లను సీజ్ చేసిన అధికారులు, వాటిల్లో అత్యంత కీలకమైన సమాచారాన్ని రాబట్టారు. ఈ ఫోన్లలో బ్లూ ఫిల్మ్‌లతో పాటు, మరికొందరు హీరోయిన్ల చిత్రాలు, వీడియోలు కనిపించడంతో దీంతో డ్రగ్స్ కేసు వెనుక మరో దందా కూడా నడుస్తోందని అధికారులు విశ్వసిస్తున్నారు.

ఓ వాట్సాప్ గ్రూప్ ద్వారా వీరు దందాను నడిపించారని, డ్రగ్స్ కేసు బయటకు రాగానే ఆ గ్రూప్‌ను వీళ్ళు డిలీట్ చేశారని చెబుతున్న సీసీబీ, ఈ విషయంలోనూ లోతుగా విచారించాల్సి వుందన్నారు. ఈ సందర్భంగా దీంతో సంబంధముందని భావిస్తున్న అందరికీ నోటీసులు పంపించి విచారించాలని నిర్ణయించుకున్నట్టు తెలియజేసారు. అయితే లేటెస్ట్ గా ఈ కేసులో మరో ఇద్దరిని బెంగళూరులో సీసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కెంగేరికి చెందిన ఓ వ్యక్తిని, నైజీరియా వాసిని అరెస్ట్‌ చేసి మంగళూరుకు తరలించామని స్పష్టం చేశారు. వీరిద్దరూ ముంబై, గోవా తదితర ప్రాంతాల నుంచి మాదకద్రవ్యాలను తీసుకుని వచ్చి మంగళూరులో అమ్ముతున్నట్లు తేలిందని, తమ అదుపులో ఉన్న డ్యాన్సర్‌ కిశోర్‌ శెట్టి ఇచ్చిన సమాచారం ఆధారంగా వీళ్ళను అరెస్ట్ చేశామని అధికారులు తెలిపారు.

ప్రస్తుతం తమ కస్టడీలో ఉన్న రాగిణి, సంజనలు ఇచ్చిన సమాచారం అధారంగా గత 3 రోజుల నుంచి పలువురిని విచారించామని, వీరికి సన్నిహితంగా ఉన్నవారిని కూడా విచారిస్తున్నామని అధికారులు మీడియా సమావేశంలో తెలిపారు. అంతేకాకుండా, రాగిణి క్లోజ్ ఫ్రెండ్ ఇద్దరినీ చామరాజపేటలోని సీసీబీ కార్యాలయంలో విచారించామని, వారు డ్రగ్స్‌ వ్యాపారం చేస్తున్నట్లు తెలిసిందని, ఈ వ్యవహారంలో ఈమధ్యనే సస్పెండ్ అయిన ఓ ఏసీపీకి కూడా ప్రమేయం ఉన్నట్టు తెలిసిందని అన్నారు. ఇదిలా ఉండగా శాండిల్ వుడ్ లోని డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యి సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన సంజన “బుజ్జిగాడు” చిత్రంలో త్రిష చెల్లెలుగా నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది. ఆ తర్వాత తరుణ్ నటించిన సోగ్గాడు చిత్రంలో నటించిన సంజన యమహో యమ, సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రాల్లో కూడా నటించింది. మరి ఈ డ్రగ్స్ కేసు విచారణ పూర్తయ్యేలోపు ఇంకెన్ని భాగోతాలు బయట పడతాయోనన్న భయంతో సినీ పరిశ్రమలోని ప్రముఖులందరూ మౌనంగా ఉండిపోయారు.

telugudesk

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago