Featured

Kantharao daughter susila rao : ఇండస్ట్రీలో వాళ్లే హీరోలా? మరి మా నాన్న ఏంటి?? ఎవరు పట్టించుకోనంత తప్పు మా నాన్న ఏమి చేసారు?: కాంతారావు కూతురు సుశీలరావు

Kantharao Daughter susila rao : తెలంగాణ మొదటి సూపర్ స్టార్ అంటే కత్తుల కాంతారావు గారే. ఎన్టీఆర్ తో పాటు ఆ కాలంలో పౌరాణిక సినిమాల్లో నటుడుగా రాణించిన ఆయన అటు పౌరాణిక జానపదాలతో పాటు సాంఘిక చిత్రాలలో కూడా అలరించారు. ఇక ఎన్నో సినిమాల్లో హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసిన ఆయన విలన్ గా కూడా ప్రయత్నించారు. ఇక ఆయన నటనకు ఎంతోమంది అభిమానులు ఉన్న ఆయన అస్తిత్వాన్ని నిలుపుకోవాలని వాళ్ళ పిల్లలు ఆరాట పడుతున్నారు. ఇక అంత పెద్ద హీరో అయినా సినిమాలో సంపాదించిన ఆస్తి అంతా అందులోనే పోగొట్టుకున్న ఆయన చివరగా సొంతిల్లు లేకుండా మరణించారు. ఇక ఆయన జీవిత విశేషలను పంచుకుంటూ ఆయనకు రావాల్సిన గుర్తింపు రాలేదంటూ ఆయన కూతురు సుశీలరావు బాధపడ్డారు.

ఎన్టీఆర్.. ఏఎన్ఆర్ వాళ్లే హీరోలా.. మాయా నాన్న కాదా…

సుశీలగారు తన తండ్రి గురించి మాట్లాడుతూ ఆయన ఎన్టీఆర్ ఏఎన్ఆర్ లాంటి ఇద్దరు పెద్ద నటుల మధ్య నిలదొక్కుకున్న వ్యక్తి మా నాన్న. అప్పట్లో హీరోలంటే ముగ్గురే రామారావు, నాగేశ్వరావు, కాంతారావు కానీ ఇప్పటికీ ఇండస్ట్రీలో వాళ్ళను తలుచుకుంటారు కానీ మా నాన్నను ఎవరూ పట్టించుకోరు. వాళ్లే హీరోలా మా నాన్న కాదా.. అంటూ ప్రశ్నించారు.

పౌరానిక జానపదాల్లో ఆయన ఎన్నో పాత్రల్లో జీవించారు కానీ ఈనాడు ఎవరూ ఆయనను గుర్తు చేసుకోవడం లేదు. సినిమానే ప్రపంచంగా బ్రతికిన ఆయన చేసిన తప్పేమిటి అంటూ బాధపడ్డారు సుశీల. ఆయన పిల్లలుగా మాకు ప్రభుత్వం ఏదో చేయాలని అనుకోవడం లేదు. కనీసం మా నాన్న గారికి గుర్తింపు ఇచ్చి ఏదైనా స్మారకంగా పెడితే బాగుంటుంది అదొక్కటే కోరుకునేది అంటూ చెప్పారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 weeks ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 weeks ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 weeks ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 weeks ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 weeks ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

4 weeks ago