Karate Kalyani: గురువారం రాత్రి కరాటే కళ్యాణి ఎస్ ఆర్ నగర్ లోని యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి ఇంటికి వెళ్లడం, గొడవపడటం తో ఒక్కసారిగా కరాటే కళ్యాణి శ్రీకాంత్ ని కొట్టడం, ఆ తరువాత పక్కనున్న వాళ్ళు శ్రీకాంత్ ను కొట్టడంతో శ్రీకాంత్ కూడా కరాటే కళ్యాణి ని చెంప పై కొట్టడంతో పసిబిడ్డను ఎత్తుకున్న కళ్యాణి ఆ బిడ్డతో సహా కిందపడిపోయింది. ఆ తరువాత కళ్యాణి శ్రీకాంత్ ను పరిగెత్తించి మరీ కొట్టింది. ఎస్ ఆర్ నగర్ నుండి మధుర నగర్ వరకు తరిమింది.
నన్ను మోసం చేసాడు…
ఇక శుక్రవారం ఇరువురు ఒకరిపై ఒకరు కేసులు పెట్టారు ఇక మీడియా ముందుకు వచ్చి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. తనను అసభ్యకరంగా తాకడంతో అందుకే కొట్టానని కళ్యాణి ఆరోపించింది. ఇక శ్రీకాంత్ రెడ్డి కూడా కళ్యాణి పై ఆరోపణలు చేసాడు లక్ష రూపాయలు డబ్బు అడిగింది ఇవ్వను అన్నందుకు నాపై దాడి చేసిందని చెప్పాడు తాను పెయిడ్ ఆర్టిస్తులతో ప్రాంక్ వీడియోలు చేస్తున్నానని తప్పేమి చేయడం లేదు అంటూ వాపోయాడు.
ఇక ఈ ఘటన ఇక్కడితో ఆగకుండా కళ్యాణి మీడియా ముందుకు వచ్చి భోరున ఏడ్చింది. వాడు తప్పించుకోవటానికి నాపై నిందలు వేస్తున్నాడు. వాడు చేసిన ఆరోపణలలో ఒక శాతం నిజమున్నా మీడియా ఏం చెబితే అది చేస్తా. నేను ఆడ వాళ్లకు మద్దతు ఇచ్చి మోసపోయా. కొన్ని మీడియా సంస్థలు వెధవలకు సపోర్ట్ చేస్తున్నాయి. సొంత అక్కలతో, చెల్లెళ్లతో ఇలానే చేస్తాడా.. పిల్లలు పాడైపోతే నేను ఊరుకోను, నన్ను వాడు బెదిరించాడు. బయట ఎలా తిరుగుతావో చూస్తానన్నాడు. వాడు పరమ 420 అంటూ తీవ్ర స్థాయిలో శ్రీకాంత్ పై మండిపడింది కరాటే కళ్యాణి. ఇక శ్రీకాంత్ కరాటే కళ్యాణి పై అట్టెంప్ట్ టూ మర్డర్ బ్లాక్ మైలింగ్ కేసులను పెట్టాడు. తనకు కళ్యాణి నుండి ప్రాణహాని ఉందంటూ చెప్పుకొచ్చాడు. ఇక వీరిద్దరి ఆరోపణలలో ఎవరిది నిజమో వేచి చూడాలి.
హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…