ప్రభుత్వం ఆనందయ్య మందు పనితీరుపై పరిశోధన చేస్తుంది. ఇప్పటకే ఆనందయ్య మందుపై అనేక చర్చలు జరుగుతున్నాయి. తాజగా కరాటే మరో సంచలన కామెంట్స్ చేసింది. ఇప్పుడు కరాటే కల్యాణి చేసిన ఈ వ్యాఖ్యలపి ఏకిపారేస్తున్నారు నెటిజన్లు.
అసలు విషయానికి వస్తే.. ఇలాంటి రత్నం మా యాదవ కులంలో పుట్టినందుకు గర్వంగా ఉందని ఈ రత్నానికి భారతరత్న ఇచ్చేయాలంటూ తన కులాభిమానాన్ని చూపించారు కరాటే కళ్యాణి. ఇంకా ఆమె మాట్లాడుతూ.. “భారత రత్నాని దాచేస్తే ఎలా.. నేనూ పూర్తిగా ఆయనకు మాద్దత్తు ఇస్తున్నా.. మా అన్నకే జై అనందయ్యా.. జై యాదవ్.. జై మాధవ్.. ఇప్పటి వరకు నేను కులం గురించి ఎప్పుడూ మాట్లాడలేదు కానీ.. నేను యాదవ హక్కుల పరిరక్షణ సమితికి అధ్యక్షురాలిని. ఇప్పుడు నేను యాదవ్ అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది. నా జాతిలో ఆనందయ్య పుట్టినందుకు గర్వంగా ఉంది. కరోనా అంటే భయపడిపోతున్న ఎటువంటి సమయంలో.. కలియుగ ఆపద్భాందవుడులా, కలియుగ భోది ధర్ముడుగా కనిపిస్తున్నాడు ఆనందయ్య.. అయన ఒక వ్యక్తి శక్తిగా మారి.. లక్షల మందికి నిమిషాల్లో కరోనా తగ్గిస్తున్నాడు. పొర్లు దండాలు పెడుతున్నారు ఆయనకి.” అంటూ ఇంకా చాలా అన్నారు..
దీనికి సంబంధించిన ఫేస్ బుక్‌లో వీడియో పెట్టారు కరాటే కల్యాణి. దీనిపై ఘాటు విమర్శలే చేస్తున్నారు నెటిజన్లు. ఇటువంటి పరిస్థితుల్లో జై యాదవ్ అని అనడం అవసరమంటారా? ఇటువంటి మాటలు మాట్లాడి మీ మీద ఉన్న గౌరవం పోగొట్టుకోకండి. ఆసుపత్రికి వేళ్లేటపుడు డాక్టర్ యాదవ్ అని, డాక్టర్ రెడ్డి అని వెళ్లితే మనం పోతాం’ అంటూ కరాటే కళ్యాణి కామెంట్స్ పై ఘాటు రిప్లై ఇస్తున్నారు. ఆమె ఏమన్నారో విడియో మీరు కూడా చూసేయండి.
తెలుగు సినీ రంగంలో తన సహజమైన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన నటి ఆమని, తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర…
ఇంట్లోనే తక్కువ పదార్థాలతో, ఆరోగ్యానికి మేలు చేసే స్వీట్లు తయారు చేయడం ఇటీవలి కాలంలో మళ్లీ ట్రెండ్‌గా మారుతోంది. ముఖ్యంగా…
అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా ఆకలి వేయడం చాలా మందికి ఎదురయ్యే సాధారణ అనుభవం. రోజంతా సరైన సమయానికి భోజనం చేసినప్పటికీ…
వేసవి మొదలైనప్పుడే శరీరం చల్లదనం కోసం తపిస్తుంది. ఈ కాలంలో మార్కెట్‌లో లభించే పండ్లలో మామిడి, పుచ్చకాయ ప్రత్యేక స్థానం…
దేశవ్యాప్తంగా వేసవి ఉష్ణోగ్రతలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఉదయం నుంచే ఎండ తీవ్రత కనిపిస్తున్న నేపథ్యంలో చాలా మంది తమ…
తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…