సాత్విక్ వర్మ.. చైల్డ్ ఆర్టిస్ట్ గా మన అందరికీ బాగా తేలిన నటుడే.. జక్కన్న రాజమౌళి చెక్కిన అద్బుతమైన సినిమా బాహుబలిలో ప్రభాస్ చిన్నప్పటి పాత్రలో నటించి తనకంటూ ప్రత్యెక గుర్తింపు తెచ్చుకున్నాడు సాత్విక్ వర్మ.. అంతేకాదు దువ్వాడ జగన్నాథమ్, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా, రేసు గుర్రం, మళ్లీ రావా వంటి చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
తాజాగా సాత్విక్ సోలో హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. “బ్యాచ్” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు సాత్విక్. ఆకాంక్ష మూవీ మేకర్స్ బ్యానర్ పై యూత్‌ఫుల్ మ్యూజికల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో హీరోయిన్ గా పరిచయం అవుతున్నారు నేహా పఠాన్. కొత్త డైరెక్టర్ శివ ఈ చిత్రానికి దర్శకత్వ భాద్యతలు నిర్వహిస్తున్నాడు. రమేశ్ ఘనమజ్జి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో సాత్విక్ ఒక కాలేజీ స్టూడెంట్ గా అలరించనున్నాడు. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ మొత్తం పూర్తయింది. లాక్‌డౌన్ ఉన్న నేపద్యంలో థియేటర్లు మళ్ళీ రీ ఓపెన్ అవగానే విడుదల చేయాలని చూస్తున్నారు చిత్ర యూనిట్.
తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…
టాలీవుడ్‌లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…
టాలీవుడ్‌లో క్లాసిక్‌గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…
తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…
కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్‌కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…