ఇలాంటి రత్నం మా యాదవ కులంలో పుట్టినందుకు గర్వంగా ఉంది.. భారత రత్న ఇచ్చేయండి.. – కరాటే కల్యాణి..

0
111

ప్రభుత్వం ఆనందయ్య మందు పనితీరుపై పరిశోధన చేస్తుంది. ఇప్పటకే ఆనందయ్య మందుపై అనేక చర్చలు జరుగుతున్నాయి. తాజగా కరాటే మరో సంచలన కామెంట్స్ చేసింది. ఇప్పుడు కరాటే కల్యాణి చేసిన ఈ వ్యాఖ్యలపి ఏకిపారేస్తున్నారు నెటిజన్లు.

అసలు విషయానికి వస్తే.. ఇలాంటి రత్నం మా యాదవ కులంలో పుట్టినందుకు గర్వంగా ఉందని ఈ రత్నానికి భారతరత్న ఇచ్చేయాలంటూ తన కులాభిమానాన్ని చూపించారు కరాటే కళ్యాణి. ఇంకా ఆమె మాట్లాడుతూ.. “భారత రత్నాని దాచేస్తే ఎలా.. నేనూ పూర్తిగా ఆయనకు మాద్దత్తు ఇస్తున్నా.. మా అన్నకే జై అనందయ్యా.. జై యాదవ్.. జై మాధవ్.. ఇప్పటి వరకు నేను కులం గురించి ఎప్పుడూ మాట్లాడలేదు కానీ.. నేను యాదవ హక్కుల పరిరక్షణ సమితికి అధ్యక్షురాలిని. ఇప్పుడు నేను యాదవ్ అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది. నా జాతిలో ఆనందయ్య పుట్టినందుకు గర్వంగా ఉంది. కరోనా అంటే భయపడిపోతున్న ఎటువంటి సమయంలో.. కలియుగ ఆపద్భాందవుడులా, కలియుగ భోది ధర్ముడుగా కనిపిస్తున్నాడు ఆనందయ్య.. అయన ఒక వ్యక్తి శక్తిగా మారి.. లక్షల మందికి నిమిషాల్లో కరోనా తగ్గిస్తున్నాడు. పొర్లు దండాలు పెడుతున్నారు ఆయనకి.” అంటూ ఇంకా చాలా అన్నారు..

దీనికి సంబంధించిన ఫేస్ బుక్‌లో వీడియో పెట్టారు కరాటే కల్యాణి. దీనిపై ఘాటు విమర్శలే చేస్తున్నారు నెటిజన్లు. ఇటువంటి పరిస్థితుల్లో జై యాదవ్ అని అనడం అవసరమంటారా? ఇటువంటి మాటలు మాట్లాడి మీ మీద ఉన్న గౌరవం పోగొట్టుకోకండి. ఆసుపత్రికి వేళ్లేటపుడు డాక్టర్ యాదవ్ అని, డాక్టర్ రెడ్డి అని వెళ్లితే మనం పోతాం’ అంటూ కరాటే కళ్యాణి కామెంట్స్ పై ఘాటు రిప్లై ఇస్తున్నారు. ఆమె ఏమన్నారో విడియో మీరు కూడా చూసేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here