Karate Kalyani: సింగర్ శ్రావణ భార్గవి రోజుకొక వివాదంతో వార్తల్లో నిలుస్తున్నారు. ఈమె తన భర్త హేమచంద్ర ఇద్దరు విడిపోతున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలలో ఎలాంటి నిజం లేదని తాము విడిపోవడం లేదని క్లారిటీ ఇచ్చారు.ఇదిలా ఉండగా ఈమె అన్నమయ్య కీర్తనలలో ఒక పరి ఒక పరి అనే పాట పాడుతూ ఆ పాటలో నటిస్తూ ఒక వీడియోని తన యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేశారు.
ఈ విధంగా ఈ వీడియో సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవ్వడమే కాకుండా పెద్ద ఎత్తున వివాదాలకు కారణమైంది.వెంకటేశ్వర స్వామి పై భక్తితో అన్నమయ్య ఎంతో అద్భుతమైన కీర్తనలను రాయగా ఆ అన్నమయ్య కీర్తనలు శ్రావణ భార్గవి ఇలా పాడుతూ అందులో శృంగార భరితంగా నటించడంతో ఈ పాట వివాదాస్పదంగా మారింది. ఇక వెంటనే ఎంతోమంది ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ పాట తొలగించాలని చెప్పారు.అయితే మొదట్లో తన తప్పు ఏమాత్రం లేదు తను ఈ పాట డిలీట్ చేయనని శ్రావణ భార్గవి చెప్పినప్పటికీ చివరికి వెనకడుగు వేయక తప్పలేదు.
ఇకపోతే ఈ వివాదంలోకి కరాటే కళ్యాణి ఎంట్రీ ఇచ్చారు.ఈ సందర్భంగా కరాటే కళ్యాణి మాట్లాడుతూ అన్నమయ్య కీర్తనలను ఇలా అపవిత్రం చేయడం మంచిది కాదు అయినా హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం ఒక పెళ్లైన మహిళ మెడలో తాళిబొట్టు కాలికి మెట్టెలు నుదుటిన బొట్టు పెట్టుకుని ఉండాలి నువ్వు అలాంటివి ఏమి పెట్టుకోలేదు అసలు నీవు పెళ్లయిన మహిళల ఉన్నావా అంటూ పెద్ద ఎత్తున ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇకపోతే అన్నమయ్య కీర్తనలను ఇలా శృంగార భరితంగా కాళ్లు ఊపుతూ జంతికలు తింటూ చేయడం ఏంటి.ఈ విధంగా నీకు ఇష్టం వచ్చిన విధంగా చేస్తే ప్రశ్నించే వాళ్ళు లేరు అనుకుంటున్నారా?ఒకప్పుడు కొన్ని సినిమాలలో ఇలాంటి పాటలు చేశారు అయితే అప్పుడు ప్రశ్నించే వాళ్ళు లేరు. ఇప్పుడు ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు. ఆ వీడియో తప్పకుండా డిలీట్ చేయాలని డిలీట్ చేయకపోయినా కొన్ని మార్పులైనా చేయాలని లేకపోతే భవిష్యత్తులో బాధపడాల్సి వస్తుంది అంటూ కరాటే కళ్యాణి శ్రావణ భార్గవి విషయంపై స్పందించారు.
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…