Karate Kalyani : ఏదో గొడవ పడితే ఇంకేదో వివాదం కరాటే కళ్యాణి మెడకు చుట్టుకుంది. యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి తో గొడవ పెట్టుకుని కొట్టి అతనితో కొట్టించుకుని కరాటే కళ్యాణి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఇక ఒకరిపై ఒకరు కేసు పెట్టుకోవడంతో మరింత వివాదం ముదిరింది. అయితే ఆశ్చర్యకరంగా ఈ వివాదం మరో మలుపు తిరిగి కళ్యాణి పెంచుకుంటున్న పిల్లలపైకి ఫోకస్ వెళ్ళింది. అసలు కరాటే కళ్యాణి దగ్గర ఉన్న ఆ పిల్లలు ఎవరు, చట్ట ప్రకారమే పెంచుకుంటోందా అన్న సందేహాలతో కరాటే కళ్యాణి పై చైల్డ్ వెల్ ఫేర్ లో ఫిర్యాదు వెళ్లడం జరిగింది.

బాలల పరిరక్షణ కమిషన్ కళ్యాణికి క్లీన్ చిట్….
గత రెండు రోజులుగా నటి కరాటే కళ్యాణి పెంచుకుంటున్న పాప విషయంలో బాలల పరిరక్షణ కమిషన్ విచారణలో పాల్గొంటోంది. తాజాగా సమగ్ర విచారణ అనంతరం సంబంధిత అధికారులు కళ్యాణి దగ్గర ఉన్న పాపను ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. కరాటే కళ్యాణి పాపను దత్తత తీసుకోలేదని స్పష్టం చేస్తూ క్లీన్ చిట్ ఇచ్చేసినట్లు సమాచారం. పాప తల్లిదండ్రులు రంగారెడ్డి జిల్లాకు చెందినవారు కావడంతో ఆ కేసును అక్కడి అధికారులకు ట్రాన్స్‌ఫర్ చేసినట్లు తెలుస్తుంది.

విచారణ అనంతరం కరాటే కళ్యాణి మీడియాతో మాట్లాడుతూ, “నేను పాపను దత్తత తీసుకోవాలనుకుంటే న్యాయపరంగానే తీసుకుంటాను. పాపను నేనింకా దత్తత తీసుకోలేదు, కానీ పాప తల్లిదండ్రులు పాపతో పాటు నాతోనే ఉంటున్నారు, విచారణ పూర్తయ్యాక అధికారులు నాకు క్లీన్ చిట్ ఇచ్చారు. రెండు రోజుల నుండి నా మీద అనేక ఆరోపణలు వస్తున్నాయి, వాటిని తట్టుకోలేక నా తల్లి, తమ్ముడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారని నేనే వారిని వారించి ధైర్యం చెప్పానని మీడియాకు వివరించింది. ఇక అధికారులు పిల్లలను దత్తత తీసుకునే ఎవరైనా చట్టం ఏమి సూచిస్తుందో ముందు తెలుసుకుని ఆ తరువాత దత్తత చేసుకోవాలని చెప్పారు.

































