Karpuram Padhmavathi : వెంకటేశ్వర స్వామి నా భర్త… కర్పూరం తింటూ 70 ఏళ్లుగా బ్రతుకుతున్న వృద్దురాలు…!

0
265

Karpuram Padhmavathi : ఒక ఒంటరి మహిళ దేవున్ని నిరంతం పూజిస్తూ ఒక అడవిలో క్రూర మృగాల మధ్య బతుకుతుందంటే నమ్మగలమా. కానీ 70 ఏళ్లుగా ఒక మహిళ వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ అడవిలో ఒంటరిగా బ్రతుకుతోంది. వెంకటేశ్వర స్వామి తన భర్త అంటూ చెబుతున్న పద్మావతి కేవలం కర్పూరం ఆహారంగా తీసుకుంటూ 70 ఏళ్లుగా జీవిస్తుండడం విశేషం. ఒక అడవిలో జీవిస్తున్న క్రూర మృగాలు ఆమెను ఏమీ చేయలేదు ఇవన్నీ అద్భుతాలుగా కనిపిస్తాయి. అసలు పద్మావతి గారు ఎందుకు అరణ్యంలోకి వెళ్లిపోయారు, మళ్ళీ గ్రామానికి ఎందుకు తిరిగి రాలేదో తెలుసుకుందాం.

ఆ గోవిందుడే నా భర్త… ఇక్కడే ఉంటా…

కర్పూరం పద్మావతి కి 10 నుండి 12 ఏళ్ల వయసు ఉన్నపుడు కలలో వెంకటేశ్వర స్వామి కనిపించి అడవిలోకి వచ్చి ఉండమని చెప్పడంతో అడవిలోని ఒక కొండ మీదకు వెళ్లి అక్కడే ఆ స్వామిని పూజిస్తూ 70 ఏళ్లుగా ఉంటోంది. విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం పెదకాద గ్రామం సమీపంలోని అడవిలో పద్మావతి ఒంటరిగా జీవోస్తోంది. సాక్షాత్తు ఆ ఏడుకొండలవాడు తన భర్త అంటూ చెబుతోంది. ఆహారంగా కేవలం కర్పూరం తినే పద్మావతి వేరే ఏమైనా తింటే వాంతులు అవుతాయని, కేవలం కర్పూరం మాత్రమే తిని బ్రతుకుతున్నట్లు చెప్పారు.

ఆ దేవుడే ఇక్కడ ఉండమని చెప్పాడు, నన్ను ఏ క్రూర మృగాలు ఏమి చేయలేవు అంటూ చెబుతోంది. ఇక తనకు కాపలాగా ఒక సర్పం ఎపుడూ తోడుంటుందంటూ చెప్తోంది. గ్రామస్థులు ఎంత పిలిచినా ఊరికి రాకపోవడంతో అక్కడే ఒక గుడిని నిర్మించారు గ్రామస్థులు. నిరంతరం వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ డెబ్భై ఏళ్లుగా అక్కడే జీవిస్తోంది పద్మావతి.