స్టార్ మాలో ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్టార్ మాలో ప్రసారమయ్యే అన్ని సీరియల్స్ కంటే అత్యధిక రేటింగ్స్ తో దూసుకుపోతూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ముఖ్యంగా ఈ సీరియల్ లో దీప పాత్రలో చేస్తున్నటువంటి ప్రేమి విశ్వనాథ్ కి మొదట్లో అభిమానులు భారీగా ఉండేవారు. దీపకన్న వంటలక్కగా ఎంతో ఫేమస్ అయ్యింది ప్రేమి విశ్వనాథ్.
అదేవిధంగా ఈ సీరియల్ అత్యధిక రేటింగ్ సొంతం చేసుకోవడానికి కారణం దీప పాత్ర మాత్రమే కాకుండా డాక్టర్ బాబు, మోనిత పాత్రలు కూడా కీలకమని చెప్పవచ్చు. ప్రస్తుతం వంటలక్కకి మాత్రమే కాకుండా,మోనితకి కూడా అభిమానులు పెద్ద ఎత్తున ఉన్నారని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ సీరియల్ ఎంతో ఉత్కంఠ భరితంగా కొనసాగుతూ రోజురోజుకు ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
డాక్టర్ బాబు తనపై ఉన్న ప్రేమతో మోనిత చేసిన దుర్మార్గపు పనులకు ఆమెను చంపి శవం కూడా కనిపించకుండా మాయచేసి, జైలు పాలయిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ సీరియల్ లో మోనితను చంపడానికి ఓ కారణం ఉందని తెలుస్తోంది. మరికొన్ని రోజులలో బుల్లితెరపై బిగ్ బాస్ రియాలిటీ షో ప్రారంభం కానున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ 5 లో కార్తీకదీపం ప్రేమోన్మాది, విలన్ మోనితకి అవకాశం వచ్చినట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే బిగ్ బాస్ నిర్వాహకులు ఈమెని సంప్రదించగా తను సీరియల్ తో బిజీగా ఉన్నానని చెప్పడంతో ఎలాగైనా ఈమెను బిగ్ బాస్ కార్యక్రమానికి తీసుకురావాలని నిర్వాహకులు కార్తీకదీపం డైరెక్టర్ సంప్రదించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సీరియల్ లో
మోనితను చంపి తన పాత్ర లేకుండా చేశారనే కథనాలు వినిపిస్తున్నాయి. మరి దీనిలో ఎంతవరకు నిజం ఉందనే విషయం మరి కొద్ది రోజులలో తెలియనుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…