Movie News

ఈ వారం థియేటర్లలో/ ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు ఇవే.. తెలుసుకోండి..

జెండా వందనం సందర్భంగా అటు థియేటర్లలో, ఇటు ఓటీటీలో పలు సినిమాలు సందడి చేశాయి. దీంతో పాటే మరికొన్ని చిత్రాలు కూడా అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. అవేంటో ఇక్కడ చూద్ధాం.. కనపడుటలేదు.. సునీల్ నటించిన ఈ చిత్ర ట్రైలర్ అందరికీ నచ్చేసింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కించారు దర్శకుడు బాలరాజు. మరో చిత్రం రాజ రాజ చోర. శ్రీ విష్ణు ప్రధాన పాత్రలో ఈచిత్రం తెరకెక్కుతోంది. ఇందులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా చెప్పుకునే ఓ దొంగ కథని దర్శకుడు హసిత్‌ గోలి అద్భుతంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కూడా ఆగస్టు 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక యాంకర్ గా.. ఎంతో బిజీగా బుల్లితెర తార శ్రీముఖి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం క్రేజీ అంకుల్స్ కూడా ఆగస్టు 19 న మన థియోటర్లో చక్కెర్లు కొట్టనుంది. తాము కుర్రతనంలో చేయలేకపోయిన చిలిపి పనులు ఇప్పుడు చేద్దామని అనుకుంటారు. ఈ క్రమంలోనే ఒక అందమైన అమ్మాయి స్వీటీ (శ్రీముఖి) వెంట పడతారు. ఈ క్రమంలో వాళ్లు ఎలాంటి ఇబ్బందులు పడ్డారనేదే మిగతా కథ. దీనిని ఇ సత్తిబాబు తెరకెక్కించారు.

ఆగస్టు 19 నే మరో అంతర్జాతీయ చిత్రం కూడా విడుదల కానుంది. అదే ఎఫ్‌9 చిత్రం. ఇప్పటికే అంతర్జాతీయంగా విడుదలైన ఈ సినిమా కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. విన్‌ డీజిల్‌, మిచెల్లీ రోడ్రిగోజ్‌, టైర్సీ గిబ్సన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా ఆగస్టు 19న ఇంగ్లీష్‌, హిందీతో పాటు, ఇతర భారతీయ భాషల్లోనూ విడుదల కానుంది. జస్టిన్‌ లిన్‌ దర్శకత్వం వహించారు.

బర్నింగ్ స్టార్ గా పిలవడబుతున్న సంపూర్ణష్ బాబు సినిమా ‘బజార్‌ రౌడీ’. ఇది ఆగస్టు 20 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మాస్‌ తరహా సన్నివేశాలతో వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కె.ఎస్‌. క్రియేషన్స్‌ సంస్థ నిర్మించింది. థియేటరల్లో కాకుండా ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు ఏంటంటే.. ఆహాలో ఆగస్టు 20 న ‘తరగతి గది దాటి’ విడుదల కానుంది. అమెజాన్‌ ప్రైమ్‌ లో ఆగస్టు 16 న ఇవాన్ అల్మైటీ , ద స్కెలిటన్‌ ట్విన్స్‌ (ఆగస్టు 17), నైన్‌ పర్‌ఫెక్ట్‌ స్ట్రేంజర్స్‌ (ఆగస్టు 18), అన్నెట్టే (ఆగస్టు 20), కిల్లర్‌ ఎమాంగ్‌ అజ్‌ (ఆగస్టు 20), హోమ్‌ (ఆగస్టు 19) విడుదల కానున్నాయి. ఇక నెట్‌ఫ్లిక్స్‌ లో కామెడీ ప్రీమియం లీగ్‌ కామెడీ షో (ఆగస్టు 20), స్వీట్‌గర్ల్‌ (ఆగస్టు 21) విడుదల కానున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago