Movie News

Karthika Deepam : నేరచరిత్ర బయటపెట్టిన మోనిత.. నిన్ను బతకనివ్వను అంటూ.. మోనితకు గన్ గురిపెట్టిన కార్తీక్..

బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్ ఎంతో ఉత్కంఠ భరితంగా కొనసాగనుంది. గత ఎపిసోడ్ లో భాగంగా హిమను చంపినది మోనిత అని తెలుసుకున్న కార్తీక్ తనని చంపడానికి అక్కడికి వెళ్ళిన సంగతి మనకు తెలిసిందే. ఈ రోజు కార్తీకదీపం ఎపిసోడ్1113 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది.ఈరోజు ఎపిసోడ్ లో హైలెట్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

కార్తీక్ మోనితతో మాట్లాడుతూ.. కేవలం నన్ను ప్రేమించిన పాపానికి అమాయకురాలైన హిమను చంపించావు. అని అనడంతో మోనిత షాక్ అవుతూ ఏంటి… హిమను నేను చంపిచానా.. శభాష్ దీప మన పెళ్లి ఆపడానికి ఇలాంటి కథలు అలిగిందా.. అయినా నువ్వెలా నమ్మావు. నీకు తెలుసు ఆ కారులో నువ్వు కూడా ఉన్నావు.. అందులో ఆ కారును గుద్దింది ఒక లారీ. అదేమీ రివాల్వర్ కాదు గురిచూసి ఒకర్ని కాల్చడానికి. అయినా నాపై ఇలాంటి నింద వేయడానికి నీ భార్య దగ్గర ఏ ఆధారం ఉందని కార్తీక్ ను నిలదీస్తుంది. అందుకు కార్తిక్ నువ్వే… ఆ ఆధారం నువ్వే అని అనడంతో మోనిత షాక్ అవుతుంది.

కార్తీక్ హోటల్ గదిలో దీప తీసిన వీడియోను మోనితకు చూపిస్తాడు. ఆ వీడియో చూడటంతో మోనితకు దిమ్మతిరిగిపోతుంది.ఆ వీడియో చూపిస్తూ వంటలక్క ఇచ్చిన ఆధారమే ఇది అంటూ కార్తీక్ చెబుతాడు… అప్పుడు మోనిత ఇద్దరు కలిసి ఒకే కారులో ప్రయాణించినప్పటికీ విజయవాడ వెళ్తున్నానని చెప్పిన సంఘటనను గుర్తు చేసుకుంటుంది. అప్పుడు కార్తీక్ నా భార్య నీ నిజస్వరూపాన్ని నా కళ్ళకు కట్టినట్టు చూపించింది. నువ్వు అసలు ఆడదానివేనా…. అసలు నువ్వు మనిషివేనా నీకు ఎలా మనసు ఒప్పిందే హేమను అలా చంపించడానికి.. తన కన్నతల్లి ఎక్కడ ఎక్కడో పనిచేసి హిమను డాక్టర్ గా చూడాలని ఎన్నో కలలు కంది ఆ కళలన్నింటిని బూడిదగా మార్చి పడేశావు నిన్ను ఏం చేసినా పాపం లేదు అంటూ మోనితను ఏకిపారేస్తాడు.

ఇదంతా వింటున్న భాగ్యం కంగారు పడుతుంది. హిమను నేను ప్రేమించాననీ చాంపించావు. నా ప్రేమను విడదీశావు. ఎంత దారుణమైన మనస్తత్వమే నీది అంటూ చాలా ఎమోషనల్ అవుతాడు. ఎంత నమ్మాను కన్నతల్లి.. కట్టుకున్న భార్య చెప్పినా వినకుండా స్నేహానికి నిలువెత్తు నిదర్శనం నువ్వేనని నమ్మిన నాకు పాపానికి పరాకాష్ట చూపించావు అంటూ కార్తీక్ ఎమోషనల్ అవుతాడు. ఈ క్రమంలోనే మోనితను రాక్షసి రక్త పిశాచి నీలో కనిపిస్తున్నాయి… నువ్వు నా దృష్టిలో ఒక ఆడదానివి కాదు ఒక మనిషి కాదు… నువ్వు ఒక అడవి మృగానివి. ఇప్పుడు చెప్పు.. దీనికి ఏమి సమాధానం చెబుతావో చెప్పు అంటూ మోనితను నిలదీస్తాడు. అప్పుడు మోనిత ఉంది సమాధానం ఉంది… నేను అన్నిటికీ సిద్ధంగా ఉన్నాను. నీ ప్రశ్నలన్నింటికీ నా దగ్గర ఒక జవాబు సిద్ధంగా ఉంది. అది ఏంటో తెలుసా…. అంటూ మోనిత బాధపడుతున్నట్లు నటిస్తూ ప్రేమ అనే సమాధానం చెబుతుంది. నువ్వంటే పిచ్చి ప్రేమ చూశావా కార్తీక్… నా ప్రేమ ఎంత గాఢమైనదో నీ కోసం నీ ప్రేమ కోసం నేను ఎంత రిస్క్ తీసుకున్నాను నీకు తెలుసా. ప్రాణాలు నిలబెట్టే వృత్తిలో ఉండే నేను నీ కోసం ప్రాణాలు తీశాను. అందుకు కారణం నీ పై నాకున్న ప్రేమ. అయినా నీకు ఇంకా చాలా నిజాలు తెలియదు అంటూ మోనిత గతంలో చేసిన తప్పులన్నీ బయట పెడుతుంది.

హిమ చావు గురించి తెలిస్తేనే ఇంతలా రియాక్ట్ అయ్యావు. మరి నేను నీ ప్రేమ కోసం నీ కోసం నీ భార్య దీపని చంపడానికి కూడా దుర్గతో బేరం కుదుర్చుకున్నాను. ఆ సంగతి నీకు తెలుసా.. అయినా ఆ దీప బతికింది. ఆ యాక్సిడెంట్ నువ్వే చేయించామని దీప కు రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్లేలా చేశాను… నిన్ను నీ భార్యను విడదీయడానికి విహారిని అడ్డుపెట్టుకొని నీలో అనుమానాన్ని పెంచి పోషించింది ఎవరనుకున్నావు .. నేనే.. ఎందుకు అనుకున్నావ్.. ప్రేమ నీ పై ఉన్న ప్రేమ కార్తీక్.. నా ప్రేమలో ఎంత నిజాయితీ ఉందో తెలుసా? నీ భార్య మీద నీకు అనుమానం కలగడానికి ముందే నీ మీద నీకు అనుమానం కలిగేలా చేశాను… హిమకు నీకు యాక్సిడెంట్ జరిగినప్పుడే డాక్టర్ చేత పిల్లలు పుట్టరని అబద్ధం చెప్పించాను. అయినా నువ్వు దీపని పెళ్లి చేసుకున్నావు. దీప గర్భవతి కాగానే అనుమానంతో వదిలేసావు. డెలివరీ టైంలో దీపకు స్లో పాయిజన్ ఇచ్చిన విషయాన్ని కూడా బయటపెట్టింది.

అదే విధంగా తన గర్భవతి కావడానికి కూడా కారణం ఏమిటో బయటపెట్టింది. పిల్లలు పుడతారా లేదా అని టెస్టింగ్ కి ఇచ్చిన శాంపిల్ ను నా గర్భంలోకి ప్రవేశపెట్టకొని గర్భవతినీ అయ్యానంటూ అసలు నిజం బయట పెడుతుంది. నా కడుపులో ఉన్నది నీ బిడ్డే.. నా బిడ్డకు తండ్రి కావాలి.. నువ్వు నాకే సొంతం కావాలి ఇన్ని నిజాలు ఒక్కొక్కటిగా బయటపడడంతో కార్తీక్ కోపంతో గట్టిగా అరుస్తాడు. హింసను చూడకు కార్తీక్.. నా ప్రేమను చూడు అని మోనిత అనగా నోర్ముయ్ అంటూ.. దీన్ని ప్రేమంటారా అంటూ మోనిత పై విరుచుకు పడతాడు. అమాయకురాలైన హిమను చంపావు దేవత లాంటి దీపను బతికుండగానే నరకం చూపించేలా చేశావు.. ఇప్పుడు నేను కాదంటే నన్ను కూడా చంపేస్తావు. నీ లాంటి దానిని భూమిపై బతకనివ్వకూడదు అంటూ ఆమెపై గన్ గురి పెడతాడు. ఇంతటితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. తర్వాత ఎపిసోడ్ లొ పోలీసులు వచ్చి కార్తీక్ ను అరెస్టు చేసి తీసుకువెళ్లగా వంటలక్క పిల్లలు కన్నీరుమున్నీరవుతున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు..మూడు రోజుల పాటు వర్షాల హెచ్చరిక.!

ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…

1 day ago

విజయ్-సంగీత కలిసి ఉంటున్నారా? కోలీవుడ్‌లో కొత్త చర్చ..

తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…

1 day ago

ఒకడే కాదు.. తమ్ముడు కూడా టాప్ క్లాస్! సూర్యవంశీ కుటుంబంలో మరో క్రికెట్ స్టార్..

భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…

1 day ago

రూ.30 వేల అప్పు కోసం దారుణం.. స్నేహితుడినే హత్య చేసిన ఇద్దరు యువకులు..

నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…

1 day ago

ఎలాన్ మస్క్ సంపద ఎంత తెలుసా?.. ప్రపంచ జనాభాకు పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది?ఆశ్చర్యపరిచే లెక్కలు ఇవే!

ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…

1 day ago

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్..జరిమానా విధించిన న్యాయస్థానం..

హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…

1 day ago