Kasthuri Shankar : తెలుగు, తమిళ, కన్నడ భాషలలో నటించిన కస్తూరి అందరికీ సుపరిచితమే. ఇక సినిమాల తరువాత బిగ్ బాస్ తమిళ్ లో పాల్గొని మళ్ళీ ప్రేక్షకులకు దగ్గరైంది. ఇక అప్పుడప్పడు టీవీ షోలలో గెస్ట్ గా వచ్చి అలరిస్తున్న కస్తూరి మా టీవిలో వచ్చే ‘ఇంటింటి గృహలక్ష్మి’ సీరియల్ ద్వారా బుల్లితెర అభిమానులకు పరిచయం. సీరియల్ లవర్స్ చాలా మంది ఇష్టపడుతున్న సీరియల్ ఇంటింటి గృహలక్ష్మి. ఇక కస్తూరి ఆ సీరియల్ లో తులసిగా మెయిన్ లీడ్ లో నటించింది. ఆ సీరియల్ ద్వారా మంచి పేరు తెచ్చుకుంది. ఇక తన సినిమా కెరీర్ గురించి మాట్లాడిన కస్తూరి శంకర్ తన మీద వచ్చిన గాసిప్స్ మీద స్పందించారు.
చికెన్ కోసం గొడవ చేశా అని రాశారు… రాసిన వాళ్ళు కనిపిస్తే…
కస్తూరి శంకర్ ‘అన్నమయ్య’ సినిమాలో రమ్యకృష్ణ తో పాటు హీరోయిన్ గా నటించిన ఆమె అందులో బ్రాహ్మణ యువతిగా అన్నమయ్య కు భార్యగా నటించారు. అయితే ఆ సినిమా షూటింగ్ సమయంలో రమ్యకృష్ణ, కస్తూరి ఇద్దరూ చికెన్ కోసం గొడవ చేసారని, చికెన్ పెడితేనే షూటింగ్ లో పాల్గొంటామని గోల చేశారని, ఈ గాసిప్ అప్పట్లో ఎవరో రాసారని కస్తూరి పేర్కొన్నారు.
ఈ విషయం గురించి కస్తూరి మాట్లాడుతూ నేను వెజిటేరియన్ అని అందరికీ తెలుసు కానీ ఇలాంటి గాసిప్స్ ఎందుకు రాసారో తెలియదు. ఆ సమయంలో అమెరికా లో ఉన్నాను. అపుడు ఎవరు ఈ గాసిప్ రాసారో వెతకాలని అనుకున్నా కొద్ది రోజులకు వదిలేసాను. ఆ గాసిప్ రాసిన వాళ్ళు నాకు కనిపిస్తే అపుడు ఉండేది అంటూ కస్తూరి అప్పటి విషయాలను పంచుకున్నారు.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్‌లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లోని ఆస్తుల…