Movie News

Kasturi Shankar: పూనమ్ పాండే వివాదం పై స్పందించిన కస్తూరి శంకర్.. ఇది సిగ్గుచేటంటూ కామెంట్స్!

Kasturi Shankar: బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా పేరు ప్రఖ్యాతలు పొందినటువంటి పూనం పాండే ఇటీవల పెద్ద ఎత్తున వార్తలలో నిలిచిన సంగతి మనకు తెలిసిందే. ఈమె సోషల్ మీడియా వేదికగా మరణించినట్టు ఒక పోస్ట్ చేయడంతో ఇది కాస్త సంచలనంగా మారింది. గర్భాశయ క్యాన్సర్ తో తాను మరణించానని ఈమె పోస్ట్ చేశారు.

ఇలా ఈమె మరణ వార్త నిజమేనని భావించి ఎంతో మంది సినీ సెలబ్రిటీలు ఈమెకు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పించారు. ఇలా ఈమె వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి తరుణంలో తాను చనిపోలేదని బ్రతికే ఉన్నానని అయితే అందరికీ ఈ సర్వైకల్ క్యాన్సర్ పట్ల అవగాహన తీసుకురావడం కోసమే ఇలా చేశాను అంటూ చెప్పుకోవచ్చారు.

ఇక ఈ విషయంపై ఎంతో మంది సినీ సెలెబ్రెటీలు ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా మరికొందరు ఈమెపై చర్యలు తీసుకోవాలి అంటూ డిమాండ్లు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయినటువంటి కస్తూరి శంకర్ కూడా ఈ విషయంపై స్పందించారు. పూనం తన వయసు 32 సంవత్సరాలు అని తెలిసినప్పుడే ఇది పబ్లిసిటీ స్టంట్ అనే విషయం నాకు అర్థం అయింది ఈమె కేవలం పాపులారిటీ కోసమే ఇలాంటి పోస్ట్ చేశారంటూ కస్తూరి శంకర్ తెలిపారు.

పబ్లిసిటీ కోసమే…
అది ఫేక్ న్యూస్ అని.. కేవలం పబ్లిసిటి స్టంట్ అని.. ఎందుకంటే ప్రజలకు సర్వైకల్ క్యానర్ గురించి పూర్తిగా తెలుసు. దానికి కారణంగా ఏం జరుగుతుంది అనేది తెలుసు. పూనమ్ కేవలం ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు అలా చేసిందని తెలిసింది. కానీ క్యాన్సర్ జబ్బును ఇలా పబ్లిసిటి స్టంట్ కోసం ఉపయోగించడం నిజంగా సిగ్గుచేటు అంటూ కస్తూరి శంకర్ ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

తిరుమల శ్రీవారి సేవకు.. కృష్ణయ్య, పురాణపండలకు ఎన్ని జన్మల పుణ్యమిది..

హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…

10 hours ago

మార్చి 3 చంద్రగ్రహణ ప్రభావం.. జాగ్రత్తగా లేకపోతే ఇబ్బందులే!

2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…

13 hours ago

మేడి పండులో నిజంగానే పురుగులుంటాయా? అసలు నిజం ఇదే!

“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…

14 hours ago

వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ? క్లారిటీ ఇచ్చిన కవిత:

తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…

14 hours ago

తెలంగాణ విమానయాన రంగంలో మరో అడుగు.. ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు కేంద్ర గ్రీన్ సిగ్నల్:

తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…

16 hours ago

నెలసరి నొప్పులతో బాధపడుతున్నారా? ఈ నేచురల్ జ్యూస్ ట్రై చేయండి!

నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…

16 hours ago