తెలుగు సినీ పరిశ్రమలో ఎంఎం కీరవాణి గురించి తెలియని వారంటూ ఉండరు. అతడు ఒక సినిమాకు సంగీతం వహించాడంటే.. ఎంత పెద్ద ఒత్తిడి ఉన్నా మటు మాయం అయిపోతుంది. అయితే ఎంఎం కీరవాణి చిన్న కుమారుడు శ్రీ సింహా ఇప్పటికే హీరోగా పరిచయం అయిన విషయం తెలిసిందే. కెరీర్ ఆరంభం నుంచి విలక్షణమైన సినిమాలు చేస్తున్న ఆయన.. తాజాగా దొంగగా మారిపోయారు .
మొదట శ్రీసింహా మత్తువదలరా సినిమాతో టాలివుడ్ సినీ పరిశ్రమకు పరిచయం అయ్యాడు. ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తర్వాత కొంత కాలానికి ‘తెల్లవారితే గురువారం’ సినిమాలో కూడా నటించాడు. ఆ సినిమా అంతా ఒక పెళ్లి చుట్టు కథ తిరుగుతూ ఉంటుంది. ప్రతీ ఒక్కరినీ ఈ సినిమా ఎంతగానో ఆకట్టుకుంది. దీనిలో మిషా నారంగ్, చిత్రా శుక్లా హీరోయిన్లుగా నటించారు. దీని తర్వాత శ్రీసింహా రెండు సినిమాల్లో నటిస్తున్నారు.
అందులో భాగ్ సాలే, ‘దొంగలు ఉన్నారు జాగ్రత్త’ సినిమాలు ఉన్నాయి. దొంగలు ఉన్నారు జాగ్రత్త సినిమాను రామానాయుడు ఫిల్మ్ స్కూల్ పూర్వ విద్యార్థి సతీష్ త్రిపుర దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. అయితే ఈ సినిమా చాలా రోజుల క్రితం షూటింగ్ మొదలైనా.. కరోనా కారణంగా వాయిదా పడుకుంటూ వచ్చింది. ఇప్పుడు పరిస్థితితులు మెరుగుపడటంతో సినిమా షూటింగ్‌ను మళ్లీ ప్రారంభించింది చిత్ర యూనిట్. ఇందుకు సంబంధించి ఓ ఆసక్తికర వీడియోని చిత్రబృందం షేర్ చేసింది. అందులో హీరో.. తన స్నేహితుడి పెళ్లి ఉంది.. నాకు సెలవు ఇవ్వండి అంటూ దర్శకుడిని అడగ్గా.. అతడు ఇవ్వడు.
దీంతో మళ్లీ ఆ హీరో.. ఒక్క రెండు గంటల సమయం అయినా ఇవ్వండి.. అలా వెళ్లి వాళ్లకు కనిపించి వచ్చేస్తా అంటాడు. దానికి అతడు జూమ్ కాల్ లో విషస్ చెయ్యి అంటూ చెబుతాడు. చేసేది లేక అతడు షూటింగ్ లో పాల్గొనడానికి సిద్దం అవుతుంటాడు. అయితే కెమెరా మెన్ వచ్చి మెమోరీ కనిపించడం లేదంటూ దర్శకుడికి చెబుతాడు. దీంతో షూటింగ్ మూడు గంటలు వాయిదా పడుతుంది. అదే సమయం కోసం వెయిటింగ్ చేసిన హీరో దొంగలున్నారు జాగ్రత్త అంటూ అక్కడ నుంచి వెళ్లిపోతాడు.. ఆ వీడియో లో ఆ మెమోరీ కార్డు హీరో తీసుకున్నట్లు కనపడుతుంది.
సినీ రంగంలో సాధారణంగా ఒక హీరో, కొన్ని ఎంపిక చేసిన హీరోయిన్‌లతోనే ఎక్కువ సినిమాలు చేస్తుంటారు. ముఖ్యంగా గత కాలంలో…
దక్షిణ భారతీయుల రోజువారీ ఆహారంలో ఇడ్లీ, దోశలకు ప్రత్యేక స్థానం ఉంది. వేగవంతమైన జీవనశైలిలో సమయం ఆదా కోసం చాలామంది…
మధుమేహం (డయాబెటిస్) వల్ల వచ్చే సమస్యలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ముఖ్యంగా దీర్ఘకాలంగా షుగర్ నియంత్రణలో లేకపోతే నరాలపై ప్రభావం పడే…
నేటి వేగవంతమైన జీవనశైలిలో నడుము నొప్పి ఒక సాధారణ సమస్యగా మారుతోంది. ముఖ్యంగా రోజంతా కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసే…
నేటి పట్టణ జీవనశైలిలో డెంగీ ప్రమాదం కొత్త రూపం దాల్చుతోంది. ఒకప్పుడు మురుగు నీరు, చెత్త ప్రదేశాలు ప్రధాన కారణాలుగా…
సీనియర్ నటుడు రాజశేఖర్ తన సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో…