దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నయనతార ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటిస్తూ ప్రస్తుతం ఎంతో బిజీగా ఉన్నారు. ఓవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే నయనతార యువ దర్శకుడు తన ప్రియుడు విగ్నేష్ శివన్ తో కలిసి దిగినటువంటి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తుంటారు.
తాజాగా విగ్నేష్ శివన్ పుట్టినరోజు సందర్భంగా ఎంతో గ్రాండ్ గా పార్టీ అరెంజ్ చేసిన నయనతార అతని పుట్టిన రోజు సందర్భంగా ఎంతో విలువైన బహుమతి అందజేశారు. విగ్నేష్ శివన్ పుట్టినరోజుకు సంబంధించిన ఫోటోలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గత కొంతకాలం నుంచి ప్రేమలో ఉన్న ఈ జంట కొద్ది రోజుల క్రితం నిశ్చితార్థం చేసుకున్నట్లు నయనతార ఓ ఇంటర్వ్యూలో సందర్భంగా వారి నిశ్చితార్థ ఉంగరాలను కూడా చూపించారు.
ఇప్పటి వరకు ప్రేమపక్షులుగా ఎంతో స్వేచ్ఛగా బతికిన వీరు త్వరలోనే వీరి ప్రేమ జీవితానికి స్వస్తి పలికి వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే వీరిద్దరు పెళ్లిపీటలు ఎక్కడానికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఈ ఏడాది డిసెంబర్ నెలలో క్రిస్మస్ కానుకగా 25వ తేదీ కేరళ లోని ఒక ప్రముఖ చర్చిలో వీరి వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.
మరి ఈ విషయంలోఎంతవరకు నిజం ఉందో లేదో తెలియాలంటే వీరు అధికారిక ప్రకటన చేసే వరకు వేచి ఉండాలి. ఇక సినిమాల విషయానికి వస్తే నయనతార నటించినటువంటి నెట్రికన్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదలయ్యే అద్భుతమైన విజయాన్ని అందుకుంది. అలాగే సమంత విజయ్ సేతుపతి నయనతార ముగ్గురు కలిసి ఓ వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు.నెట్ ఫ్లిక్స్ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నటువంటి బాహుబలి వెబ్ సిరీస్ లో కీలకపాత్రలో చేస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…