Keerthi Bhat : బిగ్ బాస్ సీజన్ 6 కాంటెస్టంట్ గా అడుగుపెట్టిన కీర్తి జీవితం ఒక విషాదం. ఎవరికైనా జీవితంలో అనుకోని కష్టాలు కామన్ కానీ కీర్తికి కష్టాలే జీవితం అయిపోయాయి. ధర్మస్థలం వెళ్లి వస్తూ కారు ప్రమాదంలో తల్లిదండ్రులను, అన్న వదిన వాళ్ళ పాప అందరినీ కోల్పోయింది కీర్తి. ఇక తండ్రి మరణం తట్టుకోలేక కోమాలోకి వెళ్ళి 32 రోజులు కోమాలో ఉండి ఆ తరువాత కోలుకున్నాక బంధువులతో ఆస్తి తాగదాలు. అవన్నీ వదిలేసి బెంగళూరుకి కట్టుబట్టల్తో వస్తే తినడానికి తిండి లేకపోతే కుక్కకి వేసిన బ్రెడ్ తిన్న రోజులు ఉన్నాయంటూ కీర్తి తన గతాన్ని చెబుతుంటే బిగ్ బాస్ హౌస్ లో మిగతా ఇంటి సభ్యులకు కన్నీరు ఆగలేదు.
తనకంటూ తోడు కోసం పాపను పెంచుకుంటే…
కీర్తి ఈ కష్టాలను దాటుకుని కాల్ సెంటర్ లో పనిచేస్తూ ఆ తరువాత హెచ్ఆర్ గా ఒక కంపెనీ లో పనిచేస్తూ తోడు కోసం ఒక పాపను దత్తత తీసుకుంది. ఇక కన్నడ సీరియల్స్ కి ఆడిషన్ ఇచ్చింది. మొదట్లో రిజెక్ట్ అయినా మళ్ళీ మెల్లగా సీరియల్స్ లో అడుగుపెట్టి కెరీర్ ను నిర్మించుకుంది. ఇక పాపను బాగా పెంచుకుంటూ కొంచెం ఆనందించే లోపే ఆ పాప కూడా దూరమై పోయిందని ఏడ్చింది కీర్తి.
బిగ్ బాస్ కి వచ్చే ముందు పాప ఆరోగ్యం బాగోలేక హాస్పిటల్ లో ఉంచి చికిత్స చేయిస్తుంటే పాప మరణించిందని చివరిగా పాపను చూసుకోలేక పోయానని చెప్పి కన్నీటిపర్యంతం అయింది కీర్తి. బిగ్ బాస్ లో సిసింద్రి అనే టాస్క్ లో భాగంగా అందరూ తమ గతంలో జరిగిన బాధాకరమైన సంఘటనలను తల్చుకుని ఎమోషనల్ అయ్యారు. ఇక అందరినీ కీర్తి గతం ఎక్కువ బాధించింది. నిజంగా కీర్తికి వచ్చిన కష్టాలు ఇంకెవరికీ రాకూడదంటూ చాలామంది నెటిజన్స్ కూడా అభిప్రాయపడుతున్నారు.
ఇటీవల అంతర్జాతీయ రాజకీయ పరిణామాల మధ్య సోషల్ మీడియాలో ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారిన పేరు నటాలీ ఎ. బేకర్.…
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వ్యక్తిగత జీవితంపై గతంలో చక్కర్లు కొట్టిన ఓ పాత గాసిప్ మరోసారి చర్చనీయాంశంగా మారింది.…
విజయవాడలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం Sri Durga Malleswara Swamy Templeలో భక్తుల నుంచి వచ్చిన హుండీ ఆదాయం గణనీయంగా…
ఐపీఎల్ 2026లో ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. జట్టు కీలక లెఫ్ట్…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా నిలిచిన ఆకివీడు రామాలయం కేసులో డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణంరాజు స్వయంగా హైకోర్టులో…
ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న ఈ కాలంలో సహజ ఆహార పదార్థాలపై ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అందులో మునగాకు పొడి…