Keerthi Suresh: నాచురల్ స్టార్ నాని కీర్తి సురేష్ ఇదివరకే నేను లోకల్ సినిమా ద్వారా ప్రేక్షకులను సందడి చేసిన విషయం తెలిసిందే.ఇకపోతే ఈ సినిమా తర్వాత వీరిద్దరూ మరోసారి దసరా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమా మార్చి 30వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నారు.
ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా నార్త్ టు సౌత్ పెద్ద ఎత్తున చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ప్రస్తుతం నాని ముంబైలో హీరో రానాతో కలిసి ప్రమోషన్ కార్యక్రమాలను చేపట్టారు. ఈ కార్యక్రమాలలో భాగంగా నటి కీర్తి సురేష్ చేసిన పనికి రానా, నాని ఇద్దరూ షాక్ లో ఉండిపోయారు.ఇంతకీ కీర్తి సురేష్ ఏం పని చేసింది అనే విషయానికి వస్తే…
దసరా సినిమాలో నాని మందు తాగే సన్ని వేషాలలో ఎత్తిన సీసా దించకుండా మందు తాగే సీన్స్ ఉన్నాయట. ఈ క్రమంలోనే ప్రమోషన్లలో భాగంగా నాని మరోసారి అలా మందు తాగి చూపించారు. నాని సీసా ఎత్తకుండా మందు తాగి చూపించడంతో రానా కూడా అలాగే చేశారు. ఇక వీరిద్దరిని చూసిన కీర్తి సురేష్ తానేమి తక్కువ కాదంటూ ఆమె కూడా కల్లు సీసా ఎత్తి దించకుండా గుట గుట తాగేశారు.
కీర్తి సురేష్ ఇలా తాగడంతో అక్కడ ఉన్నటువంటి ప్రేక్షకులు ఆమెను మరింత తమ అరుపులతో ప్రోత్సహించారు. ఇక కీర్తి సురేష్ ఇలా చేయడంతో నాని, రానా ఇద్దరు కూడా షాక్ లో ఉండిపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల అనే నూతన దర్శకుడు పని చేయగా సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…