Keerthy Suresh: సినీ నటి కీర్తి సురేష్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ ఓ వార్త గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సీనియర్ నటి మేనక ప్రముఖ నిర్మాత సురేష్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కీర్తి సురేష్ నటిగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.
కేవలం సౌత్ సినీ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా ఈమె ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా సినిమా అవకాశాలను అందుకున్నారు. ఇక మహానటి సినిమా ద్వారా ఉత్తమ జాతీయ నటిగా పురస్కారాన్ని కూడా కీర్తి సురేష్ సొంతం చేసుకున్నారు. ఇలా కెరియర్ పై ఎంతో ఫోకస్ చేసిన ఈమె పెళ్లి గురించి తరచూ సోషల్ మీడియాలో వార్తలు వినపడుతూనే ఉన్నాయి.
ఇక గతంలో తన పెళ్లి గురించి ఇలాంటి వార్తలు రావడంతో ఈమె స్పందిస్తూ ఆ వార్తలను పూర్తిగా ఖండించారు. తాజాగా మరోసారి ఈమె పెళ్లి తేదీలతో సహా పెళ్లి గురించి వార్తలు వైరల్ అవుతున్నప్పటికీ ఇంకా కీర్తి సురేష్ స్పందించకపోవడంతో ఈ పెళ్లి వార్తలలో నిజం ఉందని అందరూ భావిస్తున్నారు. కీర్తి సురేష్ ఆంటోనీ తటిల్ అనే వ్యక్తితో గత 15 సంవత్సరాలుగా రిలేషన్ లో ఉన్నట్టు సమాచారం.
ఈయన దుబాయిలో ప్రముఖ బిజినెస్ మెన్ గా గుర్తింపు పొందారు. ఇలా గత కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని వీరి ప్రేమ వివాహానికి పెద్దలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో డిసెంబర్ నెల 11,12 తేదీన వీరి వివాహం గోవాలో ఎంతో అంగరంగ వైభవంగా జరగబోతుందని తెలుస్తోంది. ఇక ఈ విషయం తెలిసిన కీర్తి సురేష్ అభిమానులు ఈమెకు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు చేస్తున్నారు.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…