టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “ఆర్ఆర్ఆర్” చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారు.అదేవిధంగా కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఆచార్య సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో కలిసి కీలక పాత్రలో రామ్ చరణ్ సందడి చేయనున్నారు.
ఈ రెండు సినిమాల తర్వాత రామ్ చరణ్ తన తదుపరి చిత్రం తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న సంగతి మనకు తెలిసిందే. పాన్ ఇండియా తరహాలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది.త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తున్న నేపథ్యంలో ఈ సినిమాలో నటీనటుల వేటలో దర్శకులు పడ్డారు.
ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన తాజా సమాచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.రామ్ చరణ్ హీరోగా తెరకెక్కే ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన నటించడం కోసం బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇది వరకే కియారా రామ్ చరణ్ సరసన తెలుగులో “వినయ విధేయ రామ”చిత్రంలో నటించిన సంగతి మనకు తెలిసిందే.ఈ సినిమా డిజాస్టర్ కావడంతో ఈ అమ్మడు అప్పటి నుంచి బాలీవుడ్ వైపు వెళ్లి వరుస సినిమాలు చేస్తోంది. తాజాగా మరోసారి రామ్ చరణ్ తో శంకర్ సినిమాలో జత కట్టనున్నట్లు తెలుస్తోంది.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…