హైదరాబాద్: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, ఆయన సతీమణి రహస్య గోరఖ్‌ల జీవితంలో కొత్త ఆనందం నిండింది. ఇటీవలే తల్లిదండ్రులైన ఈ జంట, తాజాగా తమ మొదటి బిడ్డకు నామకరణం చేశారు. కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కిరణ్ తన కుమారుడి పేరును, అలాగే అతడి ముఖాన్ని తొలిసారిగా అభిమానులకు చూపించారు.

తన కొడుకుకు ‘హను అబ్బవరం’ అని పేరు పెట్టినట్లు కిరణ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా షేర్ చేసిన ఫోటోలో చిన్నారి పట్టు పంచకట్టులో, నుదుటిన నామాలతో చాలా క్యూట్‌గా కనిపించాడు. ఈ ఫోటోను చూసిన నెటిజన్లు, అభిమానులు “అబ్బా! ఎంత ముద్దుగా ఉన్నాడో” అంటూ కామెంట్లు, లైకులతో తమ ప్రేమను చాటుకున్నారు.
తండ్రి అయిన ఆనందంలో మునిగి తేలుతున్న కిరణ్ అబ్బవరం, తన కుమారుడితో గడిపే ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ కొత్త ప్రయాణంలో ఈ దంపతులకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.






























