Klin Kaara: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతులు పెళ్లైన 11 సంవత్సరాలకు తల్లిదండ్రులుగా ప్రమోట్ అయిన విషయం మనకు తెలిసిందే.రామ్ చరణ్ ఉపాసన కూతురికి క్లీన్ కారా అనే పేరును కూడా పెట్టారు. అయితే ఈ చిన్నారిని చూడటం కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే చిన్నారిని ఎప్పుడు అభిమానులకు పరిచయం చేస్తారన్న విషయం మాత్రం తెలియలేదు.
ఇకపోతే రామ్ చరణ్ కుమార్తె ఎవరు పోలికలతో ఉన్నారన్న విషయాన్ని తెలుసుకోవడం కోసం అభిమానులు కూడా ఎంతో ఆత్రుత కనబరుస్తున్నారు. అయితే ఉపాసన హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యే సమయంలో రాంచరణ్ మాత్రం తన కూతురు తన పోలికే ఉంది అంటూ తెలిపారు.ఇకపోతే బ్రో సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకలో భాగంగా సాయి ధరమ్ తేజ్ రామ్ చరణ్ కూతురు గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
రామ్ చరణ్ కూతురు క్లీన్ కారా గురించి సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ… చిన్నారి అచ్చం రామ్ చరణ్ పోలికలతోనే ఉన్నారని తెలిపారు.చిన్నారి చాలా క్యూట్ గా ఉండడమే కాకుండా రామ్ చరణ్ పోలికలతో ఎంతో అందంగా ఉన్నారని అలాగే తన కళ్ళు చాలా అద్భుతంగా ఉన్నాయని తెలిపారు. కూతురు తండ్రి పోలికలతో ఉంటే అదృష్టం అని చెబుతారు.
ఈ క్రమంలోనే రామ్ చరణ్ కుమార్తె కూడా అచ్చం తండ్రి పోలికలతోనే ఉండడంతో తను కూడా ఎంతో అదృష్టవంతురాలని తెలుస్తోంది. ఇలా సాయి ధరంతేజ్ రామ్ చరణ్ కూతురి గురించి తన పోలికల గురించి చెబుతూ చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే త్వరలోనే చిన్నారిని అభిమానులకు చూపిస్తారని ఫాన్స్ కూడా భావిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…