కరోనా, డెంగ్యూ అంటే ఏమిటి.. వీటి లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా?

దేశంలో కరోనా వ్యాప్తి ఇప్పట్లో తగ్గేలా లేదు. రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి.ఒక వైపు కరోనా మరొకవైపు డెంగ్యూ తో ప్రజలు పోరాడుతున్నారు.ఇవి రెండు చాలవన్నట్లు వాతావరణ మార్పులకు అనుగుణంగా వైరల్ జ్వరాలు మొదలయ్యాయి.అయితే ఈ మూడు వ్యాధులకు దాదాపుగా అన్నీ ఒకే లక్షణాలు కనిపిస్తున్నాయి.దీనితో ఈ వ్యాధి వచ్చిందో కనుక్కోవడం కొద్దిగా కష్టంగా మారింది. అయితే ఇప్పుడు ఈ కరోనా,డెంగ్యూ,వైరల్ జ్వరాల మధ్య తేడాలు ఏమిటి? వాటి లక్షణాలు ఏమిటి అనే విషయం గురించి మనం తెలుసుకుందాం..

కరోనా, డెంగ్యూ వచ్చినప్పుడు వీటి మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోవడానికి ముందుగా రెండు పరీక్షలు చేసుకోవడం చాలా ముఖ్యం.ఎవరైనా సరే జ్వరంతో ఆసుపత్రికి వెళితే కరోనా, డెంగ్యూ పరీక్షలు రెండూ ఉంటాయి. అయితే ఈ జ్వరాలు రాకుండా రక్షణ కూడా అవసరం. మీ ఇంటి చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలలో నిల్వ నీరు ఉండకూడదు. అలాగే ఎల్లప్పుడూ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. కరోనాను నివారించడానికి మాస్క్ ధరించాలి.

తప్పనిసరిగా కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలి.డెంగ్యూ జ్వరం, సాధారణ జ్వరం మధ్య తేడాను గుర్తించడానికి ముఖ్యమైనది జలుబు. డెంగ్యూ కారణంగా జ్వరం వచ్చినప్పుడు జ్వరంతో పాటు శరీరంలో నొప్పులు కూడా ఉంటాయి. అదే సమయంలో సాధారణ వైరల్ జ్వరం వచ్చినప్పుడు జలుబు, మొదలైన వాటితో కూడి ఉంటుంది. ఈ సీజన్‌లో జ్వరంతో పాటు ఒళ్లు నొప్పులు వచ్చి జలుబు లేనట్లయితే వీలైనంత త్వరగా వైద్యులను సంప్రదించాలి.

డెంగ్యూ దోమలు కుట్టిన ఒకటి లేదా రెండు రోజుల తర్వాత డెంగ్యూ జ్వరం లక్షణాలు కనిపించడం ప్రారంభిస్తాయి. డెంగ్యూ జ్వరంతో కళ్ళు ఎర్రగా మారుతాయి. రక్తం తగ్గుతుంది. తలతిరగడం వల్ల కొందరికి స్పృహ తప్పుతుంది. వాతావరణం కారణంగా వచ్చే ఈ వైరల్ జ్వరాలకు తగిన సూచనలు పాటించడం వల్ల వాటి బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు. అంతే కాకుండా ఎల్లప్పుడూ మన చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాల్లో శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి.