ముల్లంగిని చాలా మంది కేవలం కూరలో మాత్రమే ఉపయోగిస్తుంటారు.ముల్లంగిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. దీన్ని తరచుగా తీసుకుంటూ ఉండటం వల్ల చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి.చాలా మందికి మొలలు, ఉబ్బసం, దగ్గు, ఆస్తమా, ముక్కు, చెవి, గొంతు నొప్పులతో బాధపడేవారు ముల్లంగి తింటే ఎంతో మేలు. ముల్లంగిలో గ్లూకోసైడ్, ఎంజైములతోపాటూ ఆకలిని పెంచి మలబద్ధకాన్ని దూరం చేసే గుణాలు ఉన్నాయి. క్యారెట్ మాదిరిగానే ముల్లంగి కూడా భూమిలో పండుతుంది. దీనిని ర్యాడిష్ అని కూడా పిలుస్తారు. ముల్లంగి ఎక్కువగా చలికాలంలో లభిస్తుంది.
ముల్లంగి రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా అనేక ఆరోగ్యసమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ముల్లంగి కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా చర్మానికి కూడా మేలు చేస్తుంది. చలికాలంలో సీజనల్ వ్యాధుల సమస్య ఎక్కువగా వేధిస్తుంటాయి.ఆ వ్యాధులను నిరోధించి ఇమ్యూనిటీ పెంచడంలోనూ ముల్లంగి సహయపడుతుంది.ముల్లంగిలో విటమిన్ సి, రిబోఫ్లావిన్, నియాసిన్, విటమిన్ బి6, ఫోలేట్, పొటాషియం, ఐరన్, మాంగనీస్, ఫైబర్, షుగర్ పుష్కలంగా లభిస్తాయి.చలికాలంలో ముల్లంగిని తీసుకోవడం వలన ఆరోగ్యానికి చాలా ఉపయోగాలున్నాయి.
ఇందులో కాల్షియం, పొటాషియం గుండె జబ్బులను తగ్గిస్తుంది. ముల్లంగి రక్తంలో షుగర్ లెవల్స్ నియంత్రించడంతో పాటు ఇన్సులిన్ స్థాయిలను సమతుల్యం చేయడంలోనూ సహాయపడుతుంది. అలాగే ఇందులో మధుమేహం ఏర్పడకుండా నిరోధించే అనేక ఎంజైములు ఉన్నాయి. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. జీర్ణవ్యవస్థను మెరుగు పరచడంలోనూ సహాయపడుతుంది.
రోజూ ముల్లంగిని సలాడ్ గా తీసుకుంటే మలబద్ధకం సమస్య తగ్గుతుంది.ఇందులో అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్స్, ఆంథోసైనిన్లు ఉంటాయి. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. ఇందులో విటమిన్ ఎ, సి, ఈ, బి6, పొటాషియం వంటి అనేక పోషకాలున్నాయి. ముల్లంగిలో భాస్వరం, జింక్ చలికాలంలో పొడి చర్మానికి పోషణనిస్తుంది. అలాగే ముఖంపై దద్దర్లు, అలెర్జీలు వంటివి నియంత్రిస్తుంది. శరీరంలో నీటి కొరతను అధిగమించడానికి ముల్లంగిని తీసుకోవాలి. శరీరంలో డీహైడ్రేషన్ సమస్య ఉండదు. శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుంది.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…