ప్రస్తుతం కరోనా రెండవ దశ మన దేశంలో తీవ్రరూపం దాలుస్తోంది. ఈ వైరస్ బారిన పడి ఎంతో మంది ప్రజలు చిగురుటాకులా హడలిపోతున్నారు.రోజురోజుకు వ్యాధి తీవ్రత అధికంగా ఉండడంతో ఎంతోమంది ఈ మహమ్మారి బారిన పడటమే కాకుండా ఆస్పత్రిలో సరైన ఆక్సిజన్ అందక మృత్యువాత పడుతున్నారు. ఈ క్రమంలోనే మన శరీరంలో రోజుకు మూడు సార్లు ఆక్సిజన్ స్థాయిలను చెక్ చేసుకోవడం వల్ల మన ఆరోగ్య పరిస్థితి గురించి అంచనాకు రావచ్చు.
ఈ నేపథ్యంలోనే మార్కెట్లో పల్స్ ఆక్సీమీటర్లు, స్మార్ట్ వాచ్‌లకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది. దీంతో అమాంతంగా వాటి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ క్రమంలోనే కోల్‌కతాకు చెందిన ‘కేర్ నౌ హెల్త్‌కేర్’ అనే అంకుర సంస్థ ‘కేర్‌ప్లిక్స్ వైటల్స్ యాప్’ కి రూపకల్పన చేసింది.ఫోటో ప్లెథిస్మోగ్రఫీ టెక్నాలజీతో, కృత్రిమ మేధ సాయంతో కేర్‌ప్లిక్స్ వైటల్స్ యాప్ పనిచేస్తుంది.
సాధారణంగా మనం ఆక్సీమీటర్లలో ఇన్‌ఫ్రారెడ్ లైట్ సెన్సార్లు ఉంటాయి. కానీ ఈ యాప్‌లో కేవలం మన ఫోన్‌లోని ఫ్లాష్ లైట్ ద్వారా మన శరీరంలోని ఆక్సిజన్ స్థాయిలను తెలుసుకోవచ్చు. ఈ యాప్ ని ఓపెన్ చేసి మన ఫోన్ లో ఫ్లాష్ లైట్ ఆన్ చేయాలి. ఫ్లాష్లైట్ వెనుక భాగాన మన వేలిని పెట్టీ, స్కాన్ బటన్ నొక్కగానే కేవలం 40 సెకండ్లో మన శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు,పల్స్, శ్వాసక్రియ రేట్లను యాప్‌లో చూపిస్తుందని కేర్‌నౌ హెల్త్‌కేర్ సహవ్యవస్థాపకుడు శుభబ్రాతా పాల్ తెలిపారు.
ఈ యాప్ కనుగొన్న తరువాత గత ఏడాది వీటిపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించగా 96 శాతం ఇది ఎంతో సమర్థవంతంగా పనిచేస్తుందని పాల్ తెలియజేశారు. ప్రస్తుతం ఈ యాప్ కేవలం ఐవోఎస్ వినియోగదారుల కోసం యాప్‌స్టోర్‌లో అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ యూజర్ల కోసం అయితే వెబ్‌సైట్‌లో ఏపీకేను అందుబాటులోకి ఇచ్చారు. ఈ యాప్ త్వరలో ప్లే స్టోర్‌లోకి తీసుకొస్తారని సమాచారం.
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…