దేశంలో మే 2వ తేదీ పలు రాష్ట్రాలలో జరిగిన అసెంబ్లీ స్థానాల ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఈ క్రమంలోనే తమిళనాడు రాష్ట్రంలో డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ గెలుపొందారు. ఈ క్రమంలోనే డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ చెపాక్ – తిరువళ్లికేని నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు.హీరోగా ఎంతో పేరు సంపాదించుకున్న ఉదయనిది స్టాలిన్ అతి చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా,పీఎంకే అభ్యర్థి AVK కాసల్లిపై దాదాపు 69,355 ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు.
ఈ నియోజకవర్గం నుంచి ఇంత మెజార్టీతో గెలుపొంది తాతకు తగ్గ మనవడిగా పేరు సంపాదించుకున్నాడు. గతంలో కూడా ఈ నియోజకవర్గం నుంచి స్టాలిన్ తాతగారు దివంగత కరుణానిధి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే ఎమ్మెల్యేగా పోటీ చేసే ముందు ఉదయనిది తన ఎన్నికల అఫిడవిట్‌లో తన ఆస్తుల వివరాలను పొందుపరిచాడు.
ఉదయనిధి స్టాలిన్ స్థిర, చరాస్థులు అన్ని కలిపి రూ. 33 కోట్ల ఆస్తులు ఉన్నట్టు చూపించారు. 2019 -20 యేడాదిగాను రూ. 4.89 లక్షల ఆదాయం ఉన్నట్టు పేర్కొన్నారు. ఆయన భార్య కిరుతిగ పేరుపై రూ. 1.15 కోట్ల ఆస్తులు ఉన్నట్టు తెలిపారు.చరాస్తుల విషయానికొస్తే.. రూ. 21.13 కోట్లు ఉన్నట్టు పేర్కొన్నారు. భార్య కిరుతిగ పేరు మీద రూ. 1 కోటి 15 లక్షల చరాస్థులు ఉన్నాయి. ఇద్దరు పిల్లల మీద రూ. 25 లక్షల చరాస్థులు ఉన్నట్టు తెలియజేశారు.
స్టాలిన్ స్థిరచరాస్తులు ఎన్నికల అఫిడవిట్‌లో ఈ విధంగా పేర్కొన్నప్పటికీ మార్కెట్ విలువ ప్రకారం చూస్తే ఇతని ఆస్తులు 100 కోట్లపైనే ఉన్నట్లు సమాచారం. స్టాలిన్ స్థిరచరాస్తులు ఎన్ని కోట్లు ఉన్నాయో అదేవిధంగా అతనిపై 22 క్రిమినల్ కేసులు ఉన్నట్లు తెలిపారు.సైదా పేట్, కల్లకురిచి, గిండి, నుంగంబాకం, తిరుక్కువేలాయై, నాగపట్నం, కుతలం పోలీస్ స్టేషన్ లలో ఇతని పై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులన్నీ డీఎంకే పార్టీ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి చేసిన సమయాలలో నమోదైనవని తెలిపారు.
ఈ దేశంలో అన్ని భాషల్లోనూ, అన్ని రాష్ట్రాల్లోనూ ఎన్నో పీఠాలు, మఠాలు, దేవస్థానాలు, ధార్మిక మండళ్ళూ, ట్రస్ట్ లు, ధార్మిక…
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…