Featured

Kona Venkat : బాద్ షా సినిమాకి కావాలనే నా పేరును అలా చేసాడు… ఎంత దుర్మార్గం అది : కోన వెంకట్

Kona Venkat : తెలుగు సినిమా రైటర్, ప్రొడ్యూసర్ గా గుర్తింపు తెచ్చుకున్న కోన వెంకట్, తన పంచ్ డైలాగులకు బాగా ఫేమస్. దూకుడు, అదుర్స్, అల్లుడు శీను వంటి సినిమాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కెరీర్ మొదట్లో హిందీ సినిమాలకు డబ్బింగ్ రైటర్ గా పనిచేసిన కోన వెంకట్ దాదాపు 50 సినిమాలకు పనిచేసాడు. ఇటీవలే తాను సినిమాల్లోకి వచ్చి ఇరవై ఏళ్ళు గడిచిన సందర్బంగా సెలెబ్రేట్ చేసుకున్నారు. ఇక శీను వైట్ల కోన వెంకట్ జోడి సినిమాల్లో మంచి హిట్లు అందుకున్నారు. కానీ వాళ్ళ మధ్య విబేధాలు రావడంతో ఇద్దరూ మళ్ళీ కలిసి పనిచేయలేదు.

శీను వైట్ల కావాలనే బాద్ షా సినిమాకు నా పేరు అలా వేసాడు…

చిన్న వాటికి ఫీల్ అవడం ఇప్పుడు మానేశాను ఒకప్పుడు చాలా బాధపడి బాధ పెట్టినవాళ్ళను కడిగేయాలి అనే ఆలోచన ఉండేది. ఇప్పుడు అలాంటి వాటి నుండి బయటకు వచ్చేసాను అంటూ బాద్ షా సమయంలో జరిగిన సంఘటనలను కోన వెంకట్ చెప్పారు. బాద్ షా కు శీను వైట్ల తో కలిసే పనిచేసాను అయితే ఆ సినిమా టైటిల్ కార్డ్స్ లో నా పేరు అలా 2 సెకన్లు కూడా రాలేదు, నేను చూసానా లేక రాలేదా అన్న అనుమానం తో పక్కన వాళ్ళను అడిగినా అలా వచ్చి అలా వెళ్ళిపోయింది అన్నారు శీను పేరు మాత్రం ఒక 5 సెకన్లు ఉంది అపుడు బాధ అనిపించింది. కావాలనే శీను అలా చేస్తాడని అర్థమైంది అంటూ కోన చెప్పాడు.

ఇక దూకుడు సినిమా పూర్తవుతున్న సమయంలోనే ఆగడు గురించి చర్చ మొదలయింది. ఆ సమయంలో దూకుడు సినిమా కోసం అందరం కష్టపడితే అందరితో మాత్రం తానే అన్ని చేసుకున్నట్లు శీను వైట్ల చెప్పుకున్నాడు. ప్రొడ్యూసర్లు మరి ఇంకా వాళ్ళెందుకు అని మా గురించి మాట్లాడారు. ఇక ఆ ఇష్యూ తరువాత అన్నీ తానే చేసుకుంటున్నపుడు మేమెందుకు అని నేను, గోపి మోహన్ వచ్చేసాం. గుర్తింపు లేని చోట పని చేయలేము అంటూ చెప్పారు కోన వెంకట్. కోన తాను నటుడుగా కూడా ‘ఎందుకంటే ప్రేమంటే’ సినిమాలో నటించాడు. గతంలో శీను వైట్ల అలా చేసాడు అంటూ చెప్పి ఇపుడు వాటి గురించి మాట్లాడటం వల్ల వచ్చేదేమీ లేదు అంటూ చెప్పారు.

Bhargavi

Recent Posts

మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు..మూడు రోజుల పాటు వర్షాల హెచ్చరిక.!

ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…

2 days ago

విజయ్-సంగీత కలిసి ఉంటున్నారా? కోలీవుడ్‌లో కొత్త చర్చ..

తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…

2 days ago

ఒకడే కాదు.. తమ్ముడు కూడా టాప్ క్లాస్! సూర్యవంశీ కుటుంబంలో మరో క్రికెట్ స్టార్..

భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…

2 days ago

రూ.30 వేల అప్పు కోసం దారుణం.. స్నేహితుడినే హత్య చేసిన ఇద్దరు యువకులు..

నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…

2 days ago

ఎలాన్ మస్క్ సంపద ఎంత తెలుసా?.. ప్రపంచ జనాభాకు పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది?ఆశ్చర్యపరిచే లెక్కలు ఇవే!

ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…

2 days ago

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్..జరిమానా విధించిన న్యాయస్థానం..

హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…

2 days ago