Nagababu: మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియా వేదికగా గరికపాటిన ఉద్దేశించి చేసిన ట్వీట్ పెద్ద ఎత్తున వైరల్ గా మారింది. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గరికపాటి నరసింహారావు అలయ్ బలయ్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వెళ్లారు. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చినటువంటి మెగాస్టార్ చిరంజీవి పట్ల ఈయన చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపాయి.ఈ క్రమంలోనే గరికపాటి నరసింహారావు పై మెగా అభిమానులు తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు.
ఇక ఈ విషయంపై నాగబాబు పరోక్షంగా ట్వీట్ చేస్తూ ఏ పాటి వాడికైనా మెగాస్టార్ చిరంజీవినీ చూస్తే అసూయ పడటం పరిపాటే అంటూ ట్వీట్ చేయగా ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ క్రమంలోనే మెగా అభిమానుల సైతం రెచ్చిపోతూ గరికపాటి పై పెద్ద ఎత్తున విమర్శలు చేయడమే కాకుండా ఆయన క్షమాపణలు చెప్పాలనీ డిమాండ్ వ్యక్తం చేశారు.
ఇకపోతే తాజాగా నాగబాబు ట్విట్టర్ వేదికగా మరొక ట్వీట్ చేస్తూ ఈ వివాదానికి చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా నాగబాబు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. గరికపాటి వారు ఏదో మూడ్ లో అలా అని ఉండుంటారు.అతనులాంటి ఓ గొప్ప పండితుడు అలా మాట్లాడుకూడదని తనకు అర్థం వచ్చేలా అన్నామే తప్ప ఆయన క్షమాపణలు చెప్పాలని మేము కోరుకోలేదు. ఏది ఏమైనా మెగా అభిమానులు ఆయనని అర్థం చేసుకోవాలని కానీ ఆయనని ఎవరు తప్పు పట్టవద్దు ఇది నా రిక్వెస్ట్ అంటూ నాగబాబు ట్విట్టర్ వేదికగా మరొక త్వీట్ చేశారు.
ఈ విధంగా నాగబాబు గరికపాటి గురించి ఇలాంటి ట్వీట్ చేస్తూ ఈ వివాదానికి చెక్ పెట్టే ప్రయత్నం చేశారు.ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే గరికపాటి కూడా ఈ విషయంపై స్పందించి మెగాస్టార్ చిరంజీవి గారితో స్వయంగా తాను మాట్లాడతానని తెలియజేసిన సంగతి తెలిసిందే. ఇలా నాగబాబు ఈ విషయంపై స్పందించే ట్వీట్ చేయడంతో ఈ వివాదానికి పుల్ స్టాప్ పడినట్లు తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…