Konda Susmitha Patel : వరంగల్ రాజకీయాల్లో కొండా దంపతులు లేని రాజాకీయం లేదు. నక్సల్ పార్టీ నుండి రాజకీయాల్లోకి వచ్చిన కొండా మురళి ఆయన భార్య సురేఖ కాంగ్రెస్ పార్టీ లో మండల్ పరిషత్ మెంబెర్ నుండి మంత్రి వరకు ఎదిగారు. కొండా మురళిని చంపించాలని చాలా సార్లు ప్రయత్నాలు జరిగాయి. రెండు వర్గాల మధ్య వర్గపోరుతో మురళి మీద హత్యా యత్నం కూడా జరిగింది. ఇక ఈ విషయాలన్నీ ఇటీవల రామ్ గోపాల్ వర్మ ‘కొండా’ సినిమా తీసి మరీ చూపించాడు. ఇక ఈ సినిమా గురించి రాజకీయాల్లోకి రావడం గురించి కొండా సుస్మిత మాట్లాడారు అలానే వారికి ప్రధాన ప్రత్యర్థి అయిన ఎర్రబెల్లి దయాకర్ రావు గురించి ఆసక్తికర విషయాలను మాట్లాడారు.
ఎర్రబెల్లి ఎదురుపడితే చంపేస్తా…
వరంగల్ రాజకీయాల్లో ప్రత్యర్థులగా ఉన్న ఎర్రబెల్లి, కొండా ఫ్యామిలీల గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. రాజకీయాల్లో శత్రుత్వం కామన్ అయినా కొండా మురళి సురేఖల కూతురు సుస్మిత మాత్రం తమ రాజకీయ ప్రత్యర్థి ఎర్రబెల్లి కనిపిస్తే చంపేస్తా అంటూ సంచలన కామెంట్స్ చేసారు. రాజకీయాల్లోకి వరంగల్ ప్రజలు తాను రావాలని ఆహ్వానిస్తే ఖచ్చితంగా వస్తానంటూ చెప్పిన సుస్మిత తమ ప్రత్యర్థి అయిన ఎర్రబెల్లి దయాకరరావు ఎదురుగా వస్తే ఏం చేస్తారు అని ప్రశ్నించగా చంపేస్తా అంటూ తెలిపారు.
చంపి జైలుకి అయిన పోతాను, మర్డర్ కేసు పడి జైలుకైనా పోతా కానీ వాడిని చంపేస్తా అంటూ ఫైర్ అయ్యారు. తన బాల్యన్ని అంత అల్లకల్లోలం చేసింది ఎర్రబెల్లి అంటూ మాట్లాడారు. తన కుటుంబాన్ని ఎంతో ఇబ్బంది పెట్టిన అలాంటి వాడిని చంపాలని అనిపిస్తుంది అంటూ మాట్లాడారు సుస్మిత పటేల్.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…