Konda Susmitha Patel : వరంగల్ రాజకీయాల్లో కొండా దంపతులు లేని రాజకీయం లేదు. నక్సల్ పార్టీ నుండి రాజకీయాల్లోకి వచ్చిన కొండా మురళి ఆయన భార్య సురేఖ కాంగ్రెస్ పార్టీలో మండల్ పరిషత్ మెంబెర్ నుండి మంత్రి వరకు ఎదిగారు. కొండా మురళిని చంపించాలని చాలా సార్లు ప్రయత్నాలు జరిగాయి. రెండు వర్గాల మధ్య వర్గపోరుతో మురళి మీద హత్యాయత్నం కూడా జరిగింది. ఇక ఈ విషయాలన్నీ ఇటీవల రామ్ గోపాల్ వర్మ ‘కొండా’ సినిమా తీసి మరీ చూపించాడు. ఇక ఈ సినిమా గురించి రాజకీయాల్లోకి రావడం గురించి కొండా సుస్మిత మాట్లాడారు అలానే వారికి ప్రధాన ప్రత్యర్థి అయిన ఎర్రబెల్లి దయాకర్ రావు గురించి ఆసక్తికర విషయాలను మాట్లాడారు.

కెసిఆర్ కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం మాకు లేదు…
తెరాస లో ఉన్న సమయంలో ఎమ్మెల్యే టికెట్టు ఇవ్వలేదని లిస్ట్ లో పేరు లేకపోయే సరికి హరీష్ రావు వచ్చి ఒకసారి కెసిఆర్ ను కలవండి అంటూ చెప్పి వెళ్లారట. అయితే సురేఖ గారు వెంటనే మురళి గారికి ఫోన్ చేసి అడుగగా మళ్ళీ కెసిఆర్ దగ్గరకు ఏం వద్దు వదిలేయ్ వెనక్కి వచ్చేయ్ అని చెప్పారట. ఆ తరువాత పార్టీ నుండి బయటకు రావడం అన్ని జరిగాయి అంటూ కొండా సుస్మిత తెలిపారు.

కెసిఆర్ ను కలిసి ఉంటే టికెట్టు వచ్చేది కదా అనే ప్రశ్నకు ఒక ఎమ్మెల్య్ టికెట్టు కోసం కెసిఆర్ కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదంటూ చెప్పారు సుస్మిత. ఇక కేటీఆర్ గురించి అడుగగా అతను ఇంగ్లీష్ లో స్పీచ్ ఇవ్వడం తప్ప ఏం చేసాడో ఎవరికీ తెలియదు అంటూ విమర్శించారు. ఇక కవిత గురించి మాట్లాడుతూ కవిత లిక్కర్ స్కాం లో ఉంది కాబట్టే ఆమె మాట తీరు మారిపోయింది, భయం మొదలయింది అంటూ సుస్మిత అభిప్రాయపడ్డారు.





























