Kota Srinivasa Rao: సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు అటు సీరియస్ విలన్ గాను ఇటు కామెడీ విలన్ గాను ఇంకో వైపు కన్నీళ్లు పెట్టించే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను చేయగలనని నిరూపించుకున్న నటుడు. తనకంటూ విలక్షణమైన నటుడుగా గుర్తింపు తెచ్చుకున్న కోటా ప్రస్తుతం సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. అయితే అపుడపుడు కొత్త సినిమాల గురించి అలనాటి సినిమాల జ్ఞాపకాలను పలు ఇంటర్వ్యూలలో పంచుకుంటున్నారు. అలానే ఇపుడు వస్తున్న భారీ బడ్జెట్ సినిమాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
బాహుబలి ఎంతమందికి గుర్తుంది….
కంటెంట్ బాగుంటే సినిమా ఎంత చిన్నదైనా పెద్దదైనా చూడాలని సూచించారు. ఇపుడు తెలుగు సినిమా పాన్ ఇండియా ట్రెండ్ వైపు చూస్తోంది. బాహుబలి, పుష్ప, ఆర్ఆర్ఆర్, వంటి సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగా తెలుగు సినిమా గౌరవాన్ని పెంచాయి. ఇది చెప్పుకోవడానికి బాగుంటుంది అంతే. కొన్నేళ్ళ క్రితం ‘బాహుబలి’ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. రికార్డులను బద్దలు కొట్టింది. రాజమౌళి ఇంత పెద్ద హిట్ సినిమా చేయడం తెలుగువారి అదృష్టం. కానీ ఈరోజు సినిమా ఎవరికి గుర్తుంది?” ఈ విజయాలన్ని తాత్కాలికమే. ఒకప్పుడు 6నెలల వరకు సినిమా గురించి మాట్లాడుకునే వాళ్ళు. ఇక 1957 లో వచ్చిన ఎపిక్ ఫాంటసీ డ్రామా మాయాబజార్ సినిమాను ఇప్పటికి టీవీ లో వస్తే అందరు ఉత్సాహంగా చూస్తారు అలాగే అందులో వాడిన మెలకువలను గురించి మాట్లాడుకుంటున్నారు.
భారీ బడ్జెట్ అంటూ విసుగుపుట్టిస్తున్నారు….
ఇక ఇప్పటి భారీ బడ్జెట్ సినిమాలపైన కామెంట్స్ చేసారు. ఒకప్పుడు నిర్మాణ వ్యయం గురించి అసలు బయటికి వచ్చేది కాదని, ఇప్పుడు కోటి రూపాయలు ఈ ఒక్క సన్నివేశానికి పెట్టామని ప్రచారాలు జరుగుతున్నాయని అన్నారు. కంటెంట్ బాగుంటే సినిమా పెద్దదైన చిన్నదైనా చూస్తారు. కంటెంట్ బాగుంటేనే హీరో ఎవరైనా సినిమా చూస్తారు. మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్ ఉన్నారని సినిమా హిట్ అవ్వదు. కథ ఉంటేనే, సినిమా నచ్చితేనే సినిమా హిట్ అవుతుంది. జనం కొన్న టికెట్ కి ఎంటర్టైన్మెంట్ వసూలు అయ్యిందా లేదా అనేదే ఇక్కడ లెక్క అని చెప్పారు.
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…
సినీ పరిశ్రమలో కనిపించే మెరుపులు, గ్లామర్ వెనుక ఎన్నో సంవత్సరాల కష్టం దాగి ఉంటుందని ప్రముఖ నటి Mrunal Thakur…
భారత్–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో మరోసారి సంచలన చర్చకు తెరలేచింది. ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో భారత్ పాకిస్తాన్‌లోని కీలక అణు…
భారత్–పాకిస్థాన్ మధ్య నీటి అంశం మరోసారి వార్తల్లోకి వచ్చింది. పాకిస్థాన్‌కు ప్రవహిస్తున్న రావి నది మిగులు జలాలను ఇకపై పూర్తిగా…
భారతీయ వ్యాపార రంగంలో ప్రముఖ కుటుంబానికి చెందిన అనంత్ అంబానీ మరోసారి తన దాతృత్వంతో వార్తల్లో నిలిచారు. గుజరాత్ రాష్ట్రంలోని…