Categories: FeaturedMovie News

Krishna makeupman Madhava rao : మహేష్ బాబు, నరేష్ మధ్య గొడవలు నిజమేనా??: మేకప్ మాన్ మాధవరావు

Krishna makeupman Madhava rao : ఎటువంటి ప్రయోగాలకైనా ముందుండి మాస్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్న హీరో సూపర్ స్టార్ కృష్ణ. తెలుగు తెరకు కొత్తరకం సినిమాలను పరిచయం చేసిన ఆయన ట్రెండ్ సెట్టర్ గా నిలిచారు. ఎన్టీఆర్ తరువాత అంతటి మాస్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న హీరో సూపర్ స్టార్ కృష్ణ. ఆంధ్ర జేమ్స్ బాండ్ గా నిలిచిన ఆయన నేడు అశేష తెలుగు అభిమానులను వదిలి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. అయన నవంబర్ 15న మల్టీపుల్ ఆర్గన్ ఫెయిల్యూర్ వల్ల మరణించారు. ఎక్కడినుండో కుటుంబాలు కుటుంబాలు ఆయనను కడసారి చూడటానికి వస్తారని ఎవరూ అంచనా వేయలేదు. ఆయన అంతిమ యాత్రలో ఎంతోమంది పాల్గొని వారి అభిమానాన్ని చాటారు. ఇక ఆయన గురించి ఆయన వ్యక్తిగతంగా ఎలాంటి వ్యక్తో, ఇక కుటుంబం ఎలా ఉండేవారో ఆయనకు మేకప్ మాన్ గా పనిచేసిన మాధవరావు గారు తెలిపారు.

మహేష్, నరేష్ మధ్య అభిప్రాయ బేధాలు…

మాధవరావు గారు మొదటి నుండి కృష్ణగారికి మేకప్ మాన్ గా ఉండేవారు. దాదాపు ‘శ్రీ శ్రీ’ సినిమా వరకు ఆయనే పనిచేసారు. మాధవరావు గారు కృష్ణ, ఇందిరా దేవి గారు, విజయనిర్మల గారి గురించి మాట్లాడుతూ వారిద్దరూ ఎన్నో దాన ధర్మాలను చేశారంటూ చెప్పారు. విజయనిర్మల గారు చనిపోయే ఏడాది ముందు నేను ఇల్లు కొనుక్కోవాలంటే ఇరవైఐదు లక్షలు ఇచ్చారు. అప్పుగా తీసుకుని మళ్ళీ ఇచ్చేస్తాసినని చెప్పినా ఏమి వద్దు నువ్వు ఎంత సర్వీస్ చేసుంటావు మాకు అన్నారు, వారిద్దరి గొప్పతనం అది అంటూ చెప్పారు.

ఇక ఇందిరా గారు అన్న అంటూ పిలిచేవారని చెప్పారు. ఇక విజయ నిర్మల గారిని పెళ్లి చేసుకున్న తరువాత ఇందిర, కృష్ణ గారికి నలుగురు పిల్లలు పుట్టారు. వాళ్లంతా కలిసి పెరిగారు. పెళ్లి సమయానికి నరేష్ చిన్న పిల్లవాడు ఇక నరేష్ ను కృష్ణ గారు బాగా చూసుకున్నారు. అందరూ కలిసే పెరిగారు. మహేష్ కి నరేష్ కి మధ్య ఎప్పుడూ అభిప్రాయ బేధాలు లేవు, అందరూ బాగానే ఉండేవారు అంటూ మాధవరావు గారు తెలిపారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

4 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago