Krishna Vamsi : రామ్ గోపాల్ వర్మ శిష్యుడిగా సినిమా ఇండస్ట్రీ లో డైరెక్టర్ గా తొలి అడుగులేసిన కృష్ణ వంశీ గులాబీ సినిమాతో డైరెక్టర్ గా మొదలుపెట్టాడు. ఆ సినిమాతో మంచి హిట్ అందుకున్న కృష్ణ వంశీ నిన్నే పెళ్లాడతా సినిమాను నాగార్జున తో చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఆ తరువాత తీసిన సింధూరం సినిమాతో అవార్డులు అందుకున్నారు. ఇక ఆయన తీసిన అంతఃపురం సినిమా మంచి హిట్ అయి హిందీ లో కూడా ఆయనే మళ్ళీ తీశారు. హీరోయిన్ రమ్య కృష్ణ ను వివాహం చేసుకున్న ఆయన ఈ మధ్య సినిమాలకు గ్యాప్ ఇచ్చారు.

ఇప్పుడు ఖడ్గం సినిమా తీస్తే చంపుతారేమో…
2002 లో కృష్ణ వంశీ గారు తీసిన ఖడ్గం సినిమా అప్పట్లో ఒక సంచలనం. ఆ సినిమాల్లో పాతబస్తీలో తీవ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్నారు అన్నట్లుగా చూపించడం, సున్నితమైన విషయాలను చూపించడంతో ఈ సినిమాను ఆపేయాలని అభ్యంతరాలు వచ్చాయి. ఇక ఈ సినిమా విడుదల అయ్యాక కూడా చాలా థియేటర్ల వద్ద గొడవలు జరిగాయి. ఇక సినిమా అయ్యాక కృష్ణ వంశీ కొంత కాలం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని అప్పట్లో పుకార్లు కూడా వచ్చాయి.

కానీ ఆ సినిమా ఇప్పటికి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అలాంటి సినిమా మళ్ళీ కృష్ణ వంశీ నుండి వస్తుందా అని ఒక నెటిజెన్ అడగడంతో కృష్ణ వంశీ నవ్వుతూ ఈ పరిస్థితుల్లో ఖడ్గం లాంటి సినిమా తీస్తే చంపేస్తారేమో అంటూ రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా అలా అనుండొచ్చు. ఇక కృష్ణ వంశీ ప్రస్తుతం ‘రంగ మార్తాండా’ సినిమాను చేస్తున్నారు . రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ సిప్లిగంజ్ తదితరులు నటించారు. ఇప్పటికే సినిమా చూసిన ప్రముఖులు సినిమా బాగుందని ప్రశంసించారు.




























