Krishna Vamsi: టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్లలో ఒకరిగా పేరు సంపాదించుకున్న డైరెక్టర్ కృష్ణ వంశీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈయన ఒకప్పుడు ఎన్నో బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలతో ప్రేక్షకులను సందడి చేశారు. ఇక ఈయన 2017 వ సంవత్సరంలో నక్షత్రం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేకపోయింది. ఈ క్రమంలోనే ఈయన తాజాగా రంగమార్తాండ అనే సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకులు ముందుకు రాబోతున్నారు. ఇక ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతున్న నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కృష్ణవంశీ తన వ్యక్తిగత విషయాల గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు బాధ్యతలు అంటే చాలా భయమని అందుకే తాను పెళ్లి చేసుకోవాలి జీవితంలో స్థిరపడాలనే ఆలోచనలు ఉండేవి కాదని తెలిపారు. అనుకోకుండా తన జీవితంలోకి రమ్యకృష్ణ వచ్చిందని కృష్ణ వంశీ తెలిపారు. అయితే తను నా జీవితంలోకి వచ్చిన తర్వాత మా ఇద్దరికీ ఓ కుమారుడు ఉన్నాడు. ఈ మార్పు తప్ప మా జీవితంలో ఎలాంటి మార్పులు లేవని తెలిపారు.
నేను పెళ్లయిన నా జీవితాన్ని నా ఇష్టపూర్వకంగానే బ్రతికాను తన జీవితం తాను అలాగే బ్రతుకుతుంది. ఇకపోతే రమ్యకృష్ణతో డబ్బు విషయంపై విభేదాలు వచ్చాయని వార్తలు పెద్ద ఎత్తున చక్కర్లు కొట్టాయి. ఈ విషయంపై కృష్ణవంశీ స్పందిస్తూ సెలబ్రిటీలు అన్న తర్వాత ఈ విధమైనటువంటి వార్తలు రావడం సర్వసాధారణం ఇలాంటి వార్తలు విన్నప్పుడు మేము కూడా నవ్వుకుంటాము కానీ ఇలా అందరూ తప్పుగా ఆలోచిస్తారని నేను భావించలేదు ఏ కొందరో ఇలాంటి వార్తలను సృష్టిస్తుంటారు అందుకే తాను కూడా ఎప్పుడు ఈ విషయాలను ఖండించలేదని మేమిద్దరం చాలా సంతోషంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలిపారు. ప్రస్తుతం ఈయన చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…