Krishna Vamsi : రామ్ గోపాల్ వర్మ అనగానే సోషల్ మీడియా కు పండగ ఎందుకంటే ఏదో ఒక విషయాన్ని నిర్మొహమాటంగా తనకు నచ్చినట్లు చూపి వివాదానికి కారణం అవుతాడు. అయితే వర్మ సినిమా స్టైల్ డిఫరెంట్ గా ఉంటుంది. తనతో వర్క్ చేయాలని ఏ ఆర్టిస్ట్ అయినా కోరుకుంటాడు. ఇది ఒకప్పటి విషయం. ఇప్పుడు వర్మ చేస్తున్న సినిమాల గురించి పెద్దగా చెప్పుకునేలా ఏం కనిపించదు. అయితే ఒకప్పటి వర్మ స్టయిల్ సినిమాలకు కొత్త గుర్తింపు, ట్రెండ్ ను తెచ్చాయి.

అక్కడే నాకు వర్మ కు గొడవ…
అలాంటి వర్మ దగ్గర అసిస్టెంట్ గా పని చేసిన కృష్ణవంశీ సినిమాల్లో కుడా వర్మ ప్రభావం కనిపిస్తుంది కొంత వరకు. అయితే వర్మ కు కృష్ణ వంశీ కి ఒక సినిమా విషయంలో క్లాష్ వచ్చింది. ఇక ఈ ఇష్యూ గురించి కృష్ణ వంశీ క్లారిటీ ఇచ్చాడు. ‘అనగనగా ఒక రోజు’ సినిమా సమయంలో స్క్రిప్ట్ విషయంలో ఇద్దరికి క్లాష్ వచ్చింది. మొదటి సినిమా అవ్వడంతో ఆవేశం ఎక్కువై ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువవుతున్న విషయాన్ని గమనించలేదు, వర్మ గారు హెచ్చరించినా పట్టించుకోలేదు.

దాంతో ఇరవై శాతం షూటింగ్ నేను చేసాక బయటికి వచ్చేసాను. ఆయన వారించినా మొదటి సినిమా అవడంతో నాకేం కనిపించలేదు, తప్పు నాదే అంటూ చెప్పాడు కృష్ణ వంశీ. ప్రస్తుతం చాలా గ్యాప్ తరువాత కృష్ణ వంశీ రంగ మార్తాండా సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, అనసూయ, రాహుల్ సిప్లిగంజ్ తదితరులు నటిస్తున్నారు.




























