Movie News

Krishnam Raju -Chiranjeevi: స్నేహం కోసం చిరంజీవికి అండగా నిలిచిన కృష్ణంరాజు.. ప్రజారాజ్యం పార్టీలో కీలకంగా వ్యవహరించిన కృష్ణంరాజు!

Krishnam Raju -Chiranjeevi: సినిమా ఇండస్ట్రీలో నటుడిగా మాత్రమే కాకుండా రాజకీయాలలో కూడా తనదైన శైలిలో దూసుకుపోతూ ఎంపీగా బాధ్యతలను నిర్వహించారు నటుడు కృష్ణంరాజు. 1998 కాకినాడ నియోజకవర్గం నుంచి ఎంపీగా బాధ్యతలు తీసుకోవడమే కాకుండా అటల్ బీహారీ వాజ్ పాయ్ హయామంలో కేంద్ర మంత్రిగా కూడా కొనసాగారు. అయితే ఈయన సినీ కెరియర్ లోను రాజకీయ కెరియర్ లోను చిరంజీవితో ఎంతో సఖ్యతగా ఉండేవారు.

చిరంజీవి కృష్ణంరాజు ఇద్దరు మొగల్తూరుకు చెందిన వారే కావడంతో వీరి మధ్య ఎంతో మంచి అనుబంధ ఉంది. ఇలా కృష్ణంరాజు సినిమా ఇండస్ట్రీలో ఉండగా చిరంజీవి సైతం సినిమా ఇండస్ట్రీలో తనదైన శైలిలో దూసుకుపోతూ అగ్ర హీరోగా పేరు సంపాదించుకున్నారు ఇకపోతే కృష్ణంరాజు 2009వ సంవత్సరంలో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు.

ఈ విధంగా ప్రజారాజ్యం పార్టీలో చేరి కీలకంగా వ్యవహరించిన కృష్ణంరాజు రాజమండ్రి నియోజకవర్గం నుంచి లోక్ సభ స్థానానికి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇలా రాజకీయాలలో చిరంజీవికి మద్దతుగా నిలబడిన ఈయన అనంతరం ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత తిరిగి బిజెపిలో చేరారు. బిజెపిలో కొనసాగుతున్నప్పటికీ ఈయన మాత్రం రాజకీయాలలో చురుగ్గా కొనసాగలేదు.

Krishnam Raju -Chiranjeevi: మర్చిపోలేని బహుమతి ఇచ్చిన కృష్ణంరాజు..

ఇకపోతే ఒకసారి చిరంజీవి పుట్టినరోజు వేడుకలలో భాగంగా తన మేనల్లుడితో కలిసి వెళ్లిన కృష్ణంరాజు అక్కడ తన మేనల్లుడు లండన్ నుంచి తెచ్చిన ఒక కెమెరాతో అక్కడికి వచ్చిన సెలబ్రిటీల ఫోటోలను తీస్తున్నారు.అది చూసిన చిరంజీవి కెమెరా ఎక్కడ కొన్నారు అన్న దీనిని నేను లండన్ లో చూశాను చాలా కాస్ట్లీ కెమెరా అంటూ అని అడగడంతో వెంటనే కృష్ణంరాజు తన మేనల్లుడి మెడలో ఉన్నటువంటి కెమెరా తీసి చిరంజీవి మెడలో వేసి నీ బర్త్డే గిఫ్ట్ ఇదేనంటూ చెప్పారు. అలా ఆరోజు కృష్ణంరాజు ఇచ్చిన బర్త్డే గిఫ్ట్ ఎప్పటికీ మర్చిపోలేని చిరంజీవి పలుసార్లు గుర్తు చేసుకున్నారు. ఇలా వీరిద్దరి మధ్య ఎంతో మంచి అనుబంధం ఉందని చెప్పాలి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 weeks ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

4 weeks ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 weeks ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 weeks ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 weeks ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

1 month ago