Krishnam Raju: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కృష్ణంరాజు నేడు తుది శ్వాస విడిచారు. నటుడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో దాదాపు 180 సినిమాలకు పైగా నటించిన ఈయన తీవ్ర అనారోగ్య సమస్యలతో నేడు ఉదయం ఏఐజి హాస్పిటల్ లో మృతి చెందారు. ఇక ఈయన మరణ వార్త తెలియగానే చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది.
నటుడిగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి ఈయనకు అందరూ అమ్మాయిలు కావడంతో తనకు వారసులు లేరనే బాధలు ఈయన తన తమ్ముడి కుమారుడు ప్రభాస్ ను ఇండస్ట్రీకి పరిచయం చేశారు.ఇలా ఈశ్వర్ సినిమా ద్వారా ప్రభాస్ ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన కృష్ణంరాజు ప్రతి సినిమాలు తనకు చేదోడు వాదోడుగా ఉంటూ తనని ఇండస్ట్రీలో ప్రోత్సహించారు.
ఈ విధంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రభాస్ అగ్రనటుడుగా కొనసాగడమే కాకుండా ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ప్రభాస్ ను చూసి కృష్ణంరాజు ఎంతో పొంగిపోయారు. అయితే ప్రభాస్ విషయంలో కృష్ణంరాజుకు తీరని కోరిక ఒకటి మిగిలిపోయింది.
కృష్ణంరాజు కొన్ని రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూ సందర్భంగా ప్రభాస్ పెళ్లి చేసుకుంటే చూడాలని, తన పిల్లలతో ఆడుకోవాలని కోరిక ఉందని తెలిపారు. ఈ విధంగా ప్రభాస్ పెళ్లి కోసం అమ్మాయిని చూస్తున్నామని త్వరలోనే శుభవార్త చెబుతామంటూ ఈయన వెల్లడించారు. అయితే ప్రభాస్ పెళ్లి చూడకుండానే, ఆయన పిల్లలతో ఆడుకోకుండానే కృష్ణంరాజు మృతి చెందారని ఆయన కోరిక తీరకుండానే మృతి చెందారని తెలుస్తోంది. ఇక కృష్ణంరాజు మరణ వార్త తెలియగానే ఎంతోమంది ప్రభాస్ అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…