Vennela Kishore: శర్వానంద్ పరిచయం అవసరం లేని పేరు. శతమానం భవతి సినిమా తర్వాత ఈయనకు ఇప్పటివరకు ఈయనకు సరైన హిట్టు పడలేదని చెప్పాలి.శతమానం భవతి సినిమా తర్వాత వరుస సినిమాలలో నటించిన అన్ని సినిమాలు శర్వానంద్ కు తీవ్ర నిరాశను మిగిల్చాయి. ఇకపోతే ఓకే ఒక జీవితం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ సినిమా మంచి హిట్ కావడంతో శర్వానంద్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. టైం ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకి మదర్ సెంటిమెంట్ కూడా తోడవడంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇకపోతే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా శర్వానంద్ వెన్నెల కిషోర్ గురించి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు.వెన్నెల కిషోర్ ని ఉద్దేశిస్తూ ఆ నా కొడుకుకు సినిమా అవకాశం ఇప్పిస్తే ఈవెంట్ కి రాలేదు అంటూ అనడంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయారు.
ఇదేంటి శర్వానంద్ అలా అనేసారని ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారు. అయితే వీరిద్దరి మధ్య మంచి రిలేషన్ ఉందని చెప్పాలి. ఆ రిలేషన్ కారణంగానే సరదాగా శర్వానంద్ వెన్నెల కిషోర్ ను ఆట పట్టించారు.ఇక ఇదే అదనుగా భావించి పలు యూట్యూబ్ ఛానల్స్ దీనినే థంబ్ నెయిల్ గా పెట్టి తెగ వైరల్ చేశారు.
ఇకపోతే ఈ సినిమా మంచి విజయం కావడంతో ఈ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించారు.ఈ సక్సెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా పాల్గొన్నటువంటి వెన్నెల కిషోర్ శర్వానంద్ కు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా వెన్నెల కిషోర్ మాట్లాడుతూ ఆరోజు నన్ను ఈ నా కొడుకు రాలేదని అన్నావు ఇప్పుడు ప్రియదర్శగాడు ఎక్కడ అంటూ ఫన్నీ చేశారు.మొత్తానికి వీరిమధ్య సాగిన ఈ సరదా సన్నివేశాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…