Krishnam Raju : కృష్ణంరాజు.. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. రాజు కుటుంబం నుంచి వచ్చినా.. జమీందారు అయినా చాలా సామాన్యుడిలా ఉంటారు. అందరితోనూ కలిసిపోతారు. కానీ.. ఆయన్ను చూస్తే మాత్రం అందరూ భయపడిపోతారు. ఎందుకంటే.. ఆయన చూడటానికి గంభీరంగా ఉంటారు. ఆయన పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట కృష్ణం రాజు. ఆయన ఇప్పటి వరకు వందల సినిమాల్లో నటించారు. 1966 లో కృష్ణం రాజు సినిమా రంగంలో అడుగుపెట్టారు. చిలకా గోరింక అనే సినిమాతో ఆయన సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.
ఆయనకు నంది అవార్డులు, బెస్ట్ యాక్టర్ అవార్డులు, ఫిలిం ఫేర్ అవార్డులు బోలెడు వచ్చాయి. ఆయన నటించిన ఎన్నో సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. 1973 లో వచ్చిన జీవన తరంగాలు, 1974 లో వచ్చిన కృష్ణవేణి, 1976 లో వచ్చిన భక్త కన్నప్ప, 1977 లో వచ్చిన అమరదీపం, 1978 లో వచ్చిన సతీ సావిత్రి, 1978 లో వచ్చిన కటకటాల రుద్రయ్య, 1978 లో వచ్చిన మన ఊరి పాండవులు లాంటి సినిమాలు ఆయన కెరీర్ లో బెస్ట్ ఫిలింస్ గా నిలిచాయి. ఆయన ఇప్పటి వరకు 183 సినిమాల్లో నటించారు.
రెబల్ స్టార్ బిరుదు అలా వచ్చింది?
ఆయన సినిమాలు నచ్చి ఆయన అభిమానులు ఆయనకు ముద్దుగా రెబల్ స్టార్ అనే బిరుదును ఇచ్చారు. ఆ బిరుదే ఇప్పటికీ.. ప్రభాస్ కు కూడా వచ్చింది. తన పెదనాన్న నుంచే రెబల్ స్టార్ బిరుదను పొందరు ప్రభాస్. అయితే.. కృష్ణంరాజుకు రెబల్ స్టార్ అనే బిరుదు రావడానికి కారణం.. ఆయన సినిమాల్లో కన్నెర్ర చేయడం, రెబల్ గా మాట్లాడటమేనట. కృష్ణం రాజే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. నేను సినిమాల్లో కన్నెర్ర చేయడం.. కత్తందుకో జానకీ.. అంటూ సీరియస్ గా ముఖం పెట్టడం, గంభీరమైన వాయిస్ ఉండటంతో.. నాకు నా అభిమానులు.. రెబల్ స్టార్ అనే బిరుదును ఇచ్చారు.. అంటూ కృష్ణంరాజు చెప్పుకొచ్చారు.
రాజకీయాల్లోనూ రాణించిన కృష్ణంరాజు
కృష్ణంరాజు తెలుగు సినిమా ఇండస్ట్రీలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించడమే కాదు.. రాజకీయాల్లోనూ ఆయన రాణించారు. ముందు ఆయన బీజేపీలో చేరారు. కాకినాడ, నర్సాపూర్ నియోజకవర్గాల నుంచి ఆయన ఎంపీగా గెలిచారు. కేంద్ర మంత్రిగానూ ఆయన పనిచేశారు. ఆ తర్వాత 2009 లో మెగాస్టార్ చిరంజీవి స్టార్ట్ చేసిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. అయితే.. రాజమండ్రి నుంచి ఎంపీగా 2009 ఎన్నికల్లో పోటీ చేసి ఆయన ఓడిపోయారు. అప్పటి నుంచి ఆయన కొంచెం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
ప్రజారాజ్యంలో చేరి చాలా పెద్ద తప్పు చేశా
బీజేపీ పార్టీ తర్వాత.. ప్రజారాజ్యంలో చేరి చాలా పెద్ద తప్పు చేశానని కృష్ణం రాజు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ప్రజారాజ్యంలో నేను చేరి ఉండకూడదు. కానీ.. అప్పట్లో తొందరపడి.. ప్రజారాజ్యం పార్టీలో చేరా. నాకు నిజంగా యాక్టివ్ పాలిటిక్స్ లోకి రావాలని ఉంది కానీ.. అది కుదరలేదు. అందుకే.. రాజకీయాలకు ప్రస్తుతం దూరంగా ఉంటున్నా.. అంటూ కృష్ణం రాజు చెప్పుకొచ్చారు.
నా సినిమా వారసుడు ప్రభాసే
నాకు కొడుకులు లేరు. నాకు కూతుళ్లే ఉన్నారు. అయితే.. నాకు సినిమాల్లో వారసుడు అంటే మాత్రం నా సోదరుడి కొడుకు ప్రభాస్ మాత్రమే. నాలో ఉన్న క్వాలిటీస్ చాలా ప్రభాస్ లో ఉన్నాయి. ప్రభాస్ చాలా గొప్ప హీరో అవుతాడు.. అంటూ ప్రభాస్ గురించి చెప్పుకొచ్చారు కృష్ణంరాజు.
ఇంటి ముందు చెట్లు నాటుకోవడం చాలా మందికి ఇష్టమైన అలవాటు. పూల మొక్కలు, పచ్చదనం, నీడ కోసం చెట్లు పెంచడం…
భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో గొప్ప స్థానం సంపాదించిన మహానుభావుల్లో రామానుజాచార్యులు, ఆది శంకరాచార్యులు ప్రముఖులు. వేదాంత తత్వాన్ని ప్రజలకు సులభంగా…
తెలుగు బుల్లితెరపై విలన్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రీతి నిగమ్ తాజాగా తన జీవితంలో ఎదురైన కొన్ని…
హిందూ పురాణాల్లో శ్రీ మహావిష్ణువు అవతారాలలో ఒకటైన పరశురాముడు ప్రత్యేకమైన స్థానం పొందాడు. శౌర్యం, ధర్మ పరిరక్షణ, అన్యాయానికి వ్యతిరేకంగా…
సినీ నటి, రాజకీయ నాయకురాలిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించిన రోజా మళ్లీ బుల్లితెరపై సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. కొంతకాలం విరామం…
ప్రముఖ సినీ నటి తమన్నా భాటియా దాఖలు చేసిన పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ‘పవర్ సోప్స్’…