Featured

Krishnam Raju : తెరమీద అన్ని రకాల హావభావాలను పలకించగల నిలువెత్తు రూపం.. రెబల్ స్టార్ కృష్ణం రాజు.

Krishnam Raju : ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు, ఎవరీయన అని అనుకుంటారేమో అక్కడికే వస్తున్నాం, రెబల్ స్టార్ కృష్ణంరాజు ఈ‍యన తెలియని వారంటూ ఎవరూ ఉండరు. తెలుగు సినిమా కథానాయకుడిగా, రాజకీయవేత్తగా ఎన్నో కీలక బాధ్యతలు నిర్వహించారు కృష్ణంరాజు. క్షత్రీయ రాజుల వంశస్తులు, విజయనగర సామ్రాజ్యం వారసులు కృష్ణంరాజు. యాంగ్రీ యంగ్ హీరోగా, రెబల్ స్టార్‌గా తెలుగు తెరకు ఎన్నో అద్భుతమైన సినిమాలను అందించారు కృష్ణంరాజు. ఇప్పటి వరకు సుమారు 187 సినిమాల్లో నటించి తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. చిలకా గోరింక అనే చిత్రంతో కథానాయకుడిగా తెలుగు తెరకు పరిచయం అయ్యారు ఈయన. అమరదీపం, భక్త కన్నప్ప వంటి సొంత చిత్రాలల్లో నటించి అద్భుత విజయాలను సాధించారు. ఇప్పటి వరకు చేసిన 187 సినిమాల్లో కొన్ని చిత్రాలు ఇప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేశాయి. అందులో కొన్ని చిత్రాల గురించి ఇప్పుడు చూద్దాం.

1976లో బాపు దర్శకత్వంలో భక్త కన్నప్ప సినిమాలో కృష్ణం రాజు నటించి తనలోని భక్తి రసాన్ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. శ్రీకాళహస్తి ఆలయ మహాత్మ్యంలోని ముఖ్యమైన భాగమైన కన్నప కథ కృష్ణంరాజు కెరీర్‌లో చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రం ఇది. అసలు దేవుడంటేనే పడని కన్నప్ప ఓ చిన్న సంఘటనతో తనలోని భక్తి భావాన్ని ప్రదర్శించే చిత్రం ఇది. సాక్షాత్తు శివుడినే మెప్పించగలిగే పరమ భక్తుడి కన్నప్ప పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడా అన్నట్లుగా కృష్ణంరాజు తన నటన నైపుణ్యాన్ని తెరముందు ప్రదర్శించారు. ఈ చిత్రంలోని ప్రతి సన్నివేశం ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. భక్తి రసవత్తరమైన చిత్రంలోనూ నటించి మెప్పించగలరని రెబల్ స్టార్ కృష్ణం రాజు ఈ చిత్రం ద్వారా నిరూపించారు.

కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో 1984 సంవత్సరంలో నిర్మించిన చిత్రం బొబ్బిలి బ్రహ్మన్న. ఈ సినిమాలో బొబ్బిలి బ్రహ్మన్నగా కృష్ణంరాజు ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. పరుచూరి సోదరులు అందించిన కథ, మాటలు చిత్రానికి ప్లస్ పాయింట్ గా నిలిచాయి. సినిమా ప్రధానంగా నాటకీయ దృష్టికోణంతో సాగుతుంది. సినిమా ప్రారంభమైనప్పటి నుంచి చివరి వరకూ ఇదే కొనసాగుతుంటుంది. ఎన్నో సమస్యలు వాటికి సరైన పరిష్కారాలను చూపే క్రమంలో నాటకీయంగా సినిమా సాగుతుంది. ఈ సినిమా  అప్పట్లో మంచి విజయాన్ని సాధించింది. ముఖ్యంగా కృష్ణంరాజు నట జీవితంలో బొబ్బిలి బ్రహ్మన్నగా పోషించిన కథానాయక పాత్ర చిరస్మరణీయంగా నిలిచిపోతుంది.

1987లో కటకటాల రుద్రయ్య సినిమా విడుదలైంది. దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృష్ణంరాజు కథానాయకుడిగా జయసుధ, జయచిత్ర కథానాయికలుగా నటించారు. విజయమాధవి పిక్చర్స్ పతాకంపై వడ్డె శోభనాద్రి ఈ చిత్రాన్ని నిర్మించారు. జె.వి.రాఘవులు సంగీత దర్శకత్వం వహించారు. ఈ చిత్రం అప్పట్లో ఓ సెన్సేషన్‌గా నిలిచింది. అప్పట్లో ఈ సినిమా బాహుబలి కలెక్షన్స్‌ను రాబెట్టగలిగింది. కృష్ణంరాజు నటించిన 93వ చిత్రం ఇది. ఈ చిత్రం కథ కూడా వినకుండా కృష్ణంరాజు నటించిన ఏకైక చిత్రం కూడా ఇదే. దాసరి నారాయణ, కృష్ణంరాజు కాంబినేషన్‌లో వచ్చిన సినిమాల్లో కటకటాల రుద్రయ్య బాక్సాఫీస్‌నే ఓ ఊపు ఉపేసింది. 26 సెంటర్లలో 50 రోజులు 8 కేంద్రాల్లో 100 రోజులు సినిమా ఆడి బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకుంది. ఈ చిత్రాన్ని నిర్మాణానికి 18 లక్షలు ఖర్చు చేస్తే ఏకంగా 75 లక్షలను వసూలు చేసింది. ఈ క్రేజ్‌తోనే 1979లో తమిళంలో శివాజీగణేషన్‌, జయసుధ, శ్రీదేవిలతో, వి.బి.రాజేంద్రప్రసాద్ పట్టాకత్తి భైరవన్ గా మళ్ళీ సినిమాను తీశారు. హిందీలోనూ 1989లో దారసి దర్శకత్వ సారథ్యంలో జితేంద్ర హీరోగా జ్యోతిబనేజ్వాల అనే పేరుతో సినిమాను పున: నిర్మించారు. దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు కటకటాల రుద్రయ్య ఎంతటి ప్రేక్షకాదరణను పొందిదో.  

Krishnam Raju : పాత్రలో పరకాయ ప్రవేశం చేసిన రెబల్ స్టార్ కృష్ణంరాజు

 1988లో కృష్ణం రాజు నటించిన అంతిమతీర్పు సినిమా విడుదలైంది. మలయాళ డైరెక్టర్ జోషి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కృష్ణంరాజు సినీ కెరీర్‌లో ఈ చిత్రం ప్రత్యేకమైంది. మమ్ముటి ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమా కృష్ణంరాజు కెరీర్‌లోనూ మరిచిపోలేని చిత్రంగా నిలిచింది. స్వార్థ రాజకీయాలకు బలైన పాత్రలో కృష్ణంరాజు తన నటతో ప్రేక్షకులను మెప్పించారు. నా అన్నవారిని పోగొట్టుకుని, అంగవైకల్యానికి గురైనా తన నిజాయితీతో నమ్ముకున్న జర్నలిజాన్నే ఆయుధంగా మలుచుకుని సొంతంగా ఓ పేపర్‌ను స్థాపించి తనను ఆ స్థితికి తీసుకువచ్చిన వారిపై ప్రతీకారం తీర్చుకోవడమే ఈ అంతిమతీర్పు చిత్రకథాంశం. 

ఈ చిత్రానికి క్యారెక్టర్‌కి కృష్ణంరాజు న్యాయం చేశారు. అదే చిత్రం తన కెరీర్‌కే అప్పట్లో ప్లస్ పాయింట్ అయ్యింది. జి.జె పాత్రలో పరకాయ ప్రవేశం చేసినట్లు తెరమీద అన్ని రకాల హావభావాలను పలకించి నటనకు నిలువెత్తు రూపంలా నిలిచారు. ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఇవి కేవలం మచ్చుతునకలే ఇలా మరుపురాని, మరిచిపోలేని ఎన్నో సినిమాల్లో నటించి నటనతో మెప్పించారు రెబల్ స్టార్ కృష్ణంరాజు. అంతటితో ఆగిపోలేదు తన నటవారసత్వాన్ని అందిస్తూ యువ రెబల్ స్టార్‌ ప్రభాస్‌ను తెలుగు తెరకు పరిచయం చేశారు. పాన్ ఇండియన్ స్టార్‌గా ప్రభాస్ తన సినీ కెరీర్లో విజయవంతంగా దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం ఈ రెబల్ స్టార్‌లు ఇద్దరూ రాధేశ్యామ్‌లో నటించారు. ఇటీవల రాధేశ్యాం ప్రమోషన్లలో అయన పాల్గొన్నారు. అయితే శ్వాశకోశ సమస్యలతో బాధపడుతున్న అయన ఈరోజు తెల్లవారు జామున చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago