Krishnam Raju: టాలీవుడ్ రెబల్ కృష్ణంరాజు పోస్ట్ కోవిడ్ సమస్యలతో మృతి చెందిన విషయం మనకు తెలిసిందే. ఈయన గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ హైదరాబాదులోని ఏఐజి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ఉన్నారు. అయితే ఈయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆదివారం తెల్లవారుజామున ఆసుపత్రిలో మృతి చెందారు.
ఇలా కృష్ణంరాజు మరణించారన్న వార్త తెలియగానే చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఆయనతో పలువురు సినీ ప్రముఖులు తమకు ఉన్న అనుబంధం గురించి మాట్లాడుతూ ఆయనకు నివాళులు అర్పించారు.ఇకపోతే గతంలో కృష్ణంరాజు పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ క్రమంలోనే కృష్ణంరాజు గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొనీ ఒక విషయంలో తాను ఎప్పటికీ రిచ్ అంటూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. కృష్ణంరాజు ఎంతో సంపన్నుల కుటుంబంలో జన్మించారు. అయితే తాను ఆస్తులు విషయంలో రిచ్ కాదని మనసు విషయంలో చాలా రిచ్ అంటూ గతంలో కృష్ణంరాజు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.తాను సినిమాలలో సంపాదించినది మొత్తం దాచి పెట్టకుండా ఎక్కువ భాగం ఖర్చులు చేసే వాణ్ణి అంటూ ఈయన తెలిపారు.
తాను ఇంటి నుంచి స్టూడియోకు వెళ్లే వరకు మాత్రమే కృష్ణంరాజు ఒకసారి మేకప్ వేసుకున్నాను అంటే ఈ ప్రపంచంతో తనకు పని ఉండదని ఈయన తెలిపారు. ఇక తనకు పేకాట ఆడడం, మందు కొట్టడం కూడా అలవాటుగానే ఉన్నాయని అయితే ఎప్పుడూ కూడా లిమిట్ దాటదు అంటూ ఈయన వెల్లడించారు.ఇలా ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు వ్యాపారాలలో కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టామని అయితే లాభనష్టాలు గురించి ఆలోచించుకోకుండా వ్యాపారాలు చేస్తూ ఉండేవాడిని అంటూ గతంలో కృష్ణంరాజు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…