తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి మహేష్ బాబు సరసన నెంబర్ 1 నేనొక్కడినే చిత్రం ద్వారా పరిచయమైన బ్యూటీ కృతి సనన్.మహేష్ బాబు సరసన నటించినప్పటికీ ఈమెకి ఈ సినిమా ద్వారా పెద్దగా గుర్తింపు రాలేదు.ఈ సినిమా తర్వాత అక్కినేని నాగచైతన్యతో కలిసి దోచెయ్ సినిమాలో నటించారు. ఈ సినిమా కూడా ఆశించినంత ఫలితాలు ఇవ్వకపోవడంతో ఈ బ్యూటీ తన దృష్టి మొత్తం బాలీవుడ్ వైపు మళ్లించింది.ఈ క్రమంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు చేజిక్కించుకొని ఎంతో బిజీగా ఉన్నారు.
ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో కృతి సనన్ లక్ష్మణ్ ఉతేకర్ దర్శకత్వంలో రూపొందుతున్న”మిమీ”అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో 20 లక్షలు తీసుకొని ఒక అమెరికా జంటకు బిడ్డను సరోగసి ద్వారా జన్మనిచ్చే తల్లి పాత్రలో కృతిసనన్ సందడి చేయనున్నారు. ఒకవైపు కామెడీతో పాటు మరోవైపు, సెంటిమెంట్ ఉన్న పాత్రను ఎంతో చాకచక్యంగా చూపించారు.
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ ను చిత్రబృందం విడుదల చేశారు.పంకజ్ త్రిపాఠి ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు. 20 లక్షలు తీసుకొని బిడ్డకు జన్మనివ్వడానికి ఒప్పుకున్న కృతిసనన్ ఆ తర్వాత ఆ జంట తమ బిడ్డ వద్దంటే గర్భంలో దాచుకున్న బిడ్డను చంపుకోలేక కృతి ఆ ప్రాణానికి జన్మనివ్వడం ఈ ట్రైలర్‌లో మనం చూడొచ్చు.
ప్రస్తుతం ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని థియేటర్లో విడుదల చేయాలా లేక ఓటీటీలో విడుదల చేయాలా అనే సందిగ్ధంలో చిత్రబృందం ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌తో పాటు జియో సినిమా ఈ సినిమాను విడుదల చేసేందుకు ముందుకు వచ్చాయి.
దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ Regina Cassandra తాజాగా బాలీవుడ్ అనుభవాలపై సంచలన వ్యాఖ్యలు…
2026 టీ20 వరల్డ్ కప్ ఉత్కంఠభరిత దశలోకి అడుగుపెట్టింది. లీగ్ పోరాటాలు దాదాపు ముగియడంతో ఇప్పుడు అందరి చూపు సూపర్-8…
అంతరిక్ష రంగంలో కెరీర్ కలలు కనే విద్యార్థులకు ఇది మంచి అవకాశం. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థకు చెందిన విక్రమ్…
తిరుపతి నగరానికి కొద్ది దూరంలో, రేణిగుంట మండలంలోని గుడిమల్లం గ్రామంలో ఒక అపూర్వ చారిత్రక కట్టడం భక్తులను, చరిత్రాభిమానులను సమానంగా…
తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.…
భారతదేశంలో ఉద్యోగ రంగంలో కీలక మార్పులకు నాంది పలుకుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త లేబర్ కోడ్‌లు ఇప్పుడు…