టికెట్ అడిగినందుకు ఓ ప్రయాణికుడు మహిళా కండక్టర్ చొక్కా చింపేసి, ఆమెపై పిడిగుద్దులతో తీవ్రంగా దాడిచేసిన ఘటన చిత్తూరుజిల్లా, గుర్రంగకొండ, తరికొండల సమీపంలో చోటుచేసుకుంది. మదనపల్లెకు చెందిన బస్సు లో మహిళా కండక్టర్ తన విధులను నిర్వహిస్తున్నారు. అదేసమయంలో ఆర్టీసీ బస్సు ఎక్కినా శివారెడ్డి అనే వ్యక్తి ఎక్కాడు. ప్రయాణికులందరికి టికెట్లు ఇచ్చింది కండక్టర్.. అయితే శివారెడ్డి అనే వ్యక్తి మాత్రం టికెట్ తీసుకోలేదు.. టికెట్ తీసుకోకపోవడంతో అతనికి ప్రశ్నించింది మహిళా కండక్టర్. టికెట్ తీసుకోమని అడిగినందుకు కోపంతో ఊగిపోయాడు శివారెడ్డి, కాస్తసేపు ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆతరువాత ఆమెపై దాడి చేయడం మొదలుపెట్టాడు శివారెడ్డి.
మహిళ అని కూడా చూడకుండా.. ఆమె చొక్కా చింపేసాడు.. ఆమెపై పిడిగుద్దులు గుద్దుతూ తీవ్రంగా దాడి చేసాడు. చివరికి మిగిలిన ప్రయాణికులంతా కలిసి శివారెడ్డిని పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. వాల్మీకిపురం పోలీస్టేషన్ లో ఆమె పిర్యాదు చేసారు. పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆమెకు గాయాలు కావడంతో దగ్గర్లోని హాస్పిటల్ లో చికిత్సపొందుతున్నారు. దీనిపై ఆర్టీసీ కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి..
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…