Lahari: సోషల్ మీడియా పుణ్యమా అని ప్రస్తుతం సినిమా సెలబ్రెటీలతో సమానంగా బుల్లితెర నటీనటులు కూడా బాగా పాపులర్ అవుతున్నారు. అలా ఎంతో మంది బుల్లితెర నటీనటులు సీరియల్స్ లో నటిస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ మంచి గుర్తింపు సొంతం చేసుకుంటున్నారు. అలా గుర్తింపు పొందిన బుల్లితెర నటులలో లహరి కూడా ఒకరు.
చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన లహరి చక్రవాకం,ముద్దుబిడ్డ మొగలిరేకులు వంటి సూపర్ హిట్ సీరియల్స్ లో నటించింది. అంతే కాకుండా ప్రస్తుతం ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లో కూడా నటించింది.
ఇలా సీరియల్స్ లో నటిస్తూ బిజీగా ఉండే లహరి బుల్లితెర మీద ప్రసారమవుతున్న టీవీ షోలో కూడా సందడి చేస్తూ ఉంటుంది.
అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలు వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఇటీవల తాను తల్లి కాబోతున్న సంగతి సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఇక ఇటీవల తన సీమంతానికి సంబంధించిన షాపింగ్ వీడియోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఈ క్రమంలో తాజాగా లహరి సీమంతం వేడుక ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో లహరి సీమంతం ఎంతో ఘనంగా జరిగింది. ఈ సీమంతం వేడుకకు బుల్లితెర నటీనటులు కూడా హాజరయ్యారు. ప్రస్తుతం లహరి సీమంతానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ గా మారాయి. ఇక ఈ ఫోటోలు చూసిన ఆమె అభిమానులు లహరికి పండంటి బిడ్డ పుట్టాలని కోరుకుంటున్నారు.
ఇరాన్ అణు కార్యక్రమం అంశంపై అమెరికా మరోసారి కఠిన స్వరాన్ని వినిపించింది. అమెరికా అధ్యక్షుడు Donald Trump తాజాగా చేసిన…
దక్షిణాదిలో ఒక కాలంలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన నటీమణుల్లో Meena ప్రత్యేక స్థానం సంపాదించారు. చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగుపెట్టి,…
జుట్టు రాలడం ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న సమస్యగా మారింది. యువత నుంచి మధ్యవయసు వారిదాకా…
ఉమ్మడి మెదక్ జిల్లాలో వీధి కుక్కల సమస్య రోజురోజుకీ తీవ్రమవుతోంది. చిన్నారులు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా వరుసగా…
ఆస్పత్రి అంటే రోగి ప్రాణాలు కాపాడే స్థలం. కానీ కొన్నిసార్లు అక్కడే జరిగిన నిర్లక్ష్యం బాధితులకు జీవితాంతం మానని గాయాలు…
విశాఖ సాగరతీరంలో ఆదివారం జరిగిన నావికాదళ ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. RK Beach వేదికగా నిర్వహించిన ‘ఆపరేషనల్ డెమో’…