Lakshmi parvathi : లక్ష్మి పార్వతి అనగానే ఎన్టీఆర్ గారి రెండో భార్యగా అందరికీ తెలుసు. అయితే లక్ష్మి పార్వతి గారు మొదట ఎన్టీఆర్ గారి చరిత్ర రాయడానికి ఆయన వద్దకు వచ్చి ఆ తరువాత ఆయనకు నచ్చిన వ్యక్తిగా మారారు. ఇక ఆయన మరణం తరువాత పార్టీ పగ్గాలను తీసుకోవాలని భావించినా నందమూరి కుటుంబం నుండి తీవ్ర వ్యతిరేకత రావడంతో బయటికి వచ్చి సొంత పార్టీ పెట్టినా పెద్దగా రాజకీయంగా ఆమెకు కలిసి రాలేదు. ఇన్నాళ్లు పెద్దగా కనిపించని లక్ష్మి పార్వతి ప్రస్తుతం వైసీపీ పార్టీ లో చేరి జగన్ తరుపున టీడీపీ ని విమర్శిస్తూ మీడియాతో తన జీవిత విశేషాలను పంచుకుంటూ ఉంటారు.

వారహి లో హీరోయిన్స్ మేకప్ వేసుకుంటున్నారు…
పవన్ కళ్యాణ్ తన బస్సు యాత్రకోసం కొన్న వెహికిల్ పేరు వారహి. ఆ వెహికల్ ఏపీకి వచ్చినప్పటి నుండి వైసీపీ పార్టీ నుండి విమర్శల జోరు పెరిగింది. ఆ వెహికల్ ఏపీలో తిరగనివ్వం అని ఒకరంటే, ఆ వెహికల్ కొనడానికి డబ్బులెలా వచ్చాయంటూ మరికొందరు విమర్శించగా కొంతకాలంగా ఆ విమర్శలను పక్కన పెట్టారు. అయితే తాజాగా లక్ష్మి పార్వతి గారు జనసేన పార్టీ గురించి విమర్శించారు. ఎపుడు టీడీపీ, చంద్రబాబు ను విమర్శించే లక్ష్మి పార్వతి ఇప్పుడు జనసేన అధినేత అలాగే వారాహి వెహికిల్ గురించి కుడా మాట్లాడారు.

వారాహికి అన్ని కార్యక్రమాలు పూర్తి చేయించి కొండగట్టు వంటి గుడులకు వెళ్లి పూజలు చేయించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మాత్రం ఎందుకు బస్సు యాత్ర చేయలేదని కామెంట్స్ చేసారు. లోకేష్ పాదయాత్ర మొదలు పెట్టే సరికి పవన్ కళ్యాణ్ బస్సు యాత్రను మానుకున్నాడు. ప్రస్తుతం ఆ వారహి వెహికిల్ ను షూటింగ్స్ లో హీరోయిన్స్ మేకప్ కోసం అలానే ఒకచోటి నుండి మరో చోటికి షూటింగ్ టీంను తిప్పడానికి వాడుతున్నారు. ఈ విషయం నేను చెప్పడం కాదు ఆ షూటింగ్ వాళ్ళే చెబితే తెలిసింది అంటూ కామెంట్స్ చేసారు.